Home Filmy Adda “రెబల్” సినిమాలో ఈ సీన్ గమనించారా..? ఇలా ఎలా చేశారు..?

“రెబల్” సినిమాలో ఈ సీన్ గమనించారా..? ఇలా ఎలా చేశారు..?

by Mohana Priya

Ads

బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ఫేమస్ అయిన హీరో ప్రభాస్. బాహుబలికి ముందు ప్రభాస్ కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే స్టార్ హీరోగా ఉన్నారు. బాహుబలి తర్వాత బాలీవుడ్ వాళ్లు కూడా ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతోంది అంటే ఆలోచించాల్సి వస్తోంది.

Video Advertisement

అంటే ప్రభాస్ రేంజ్ ఏ స్థాయికి వెళ్ళిపోయిందో ఇది చూస్తే అర్థం అవుతుంది. అయితే ప్రభాస్ కి బాహుబలి లాంటి హిట్స్ సినిమాలు ఉన్నా కూడా, అంతకుముందు కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. అలా ఎన్నో అంచనాలతో రిలీజ్ అయ్యి ప్రేక్షకులని నిరాశపరిచిన సినిమా రెబల్. ప్రభాస్ హీరోగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.

comments on rebel scene

ఈ సినిమాలో ప్రభాస్ స్టైల్ చాలా బాగుంటుంది. ఇప్పటికి కూడా ప్రభాస్ ఈ సినిమాలో వేసుకున్న బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ చాలా మంది వేసుకొని కనిపిస్తారు. కొన్ని ఫైట్స్ కూడా చాలా స్టైలిష్ గా ఉంటాయి. కానీ సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. టేకింగ్ విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే సినిమా బాగుండేది అని అన్నారు. అందులో హీరోయిన్ పాత్ర కూడా కాస్త అతిగా ఉండటంతో ప్రేక్షకులకు ఈ సినిమా అస్సలు నచ్చలేదు.

comments on rebel scene

అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక సీన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్స్ వస్తున్నాయి. ఇందులో హీరో తన తండ్రి ముందు చాలా బుద్ధిమంతుడులాగా, అసలు గొడవలు జోలికి వెళ్ళని వ్యక్తి లాగా యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఒక సమయంలో వారిపై రౌడీలు గొడవకి వచ్చినప్పుడు హీరో వారితో ఫైట్ చేస్తాడు. ఈ సీన్ లో హీరోకి నామం ఉంటుంది. తర్వాత ఏదో గ్రాఫిక్స్ లో నామం మాయం అయిపోయినట్టు చూపిస్తారు.

comments on rebel scene

ఆ సీన్ ఎలివేషన్ కోసం వాడినా కూడా అది ఎలివేషన్ లాగా అస్సలు అనిపించదు. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఇలాంటి వాటిని కూడా ప్రేక్షకులు గమనించి వాటి మీద కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సీన్ చూసినవారు, “ఆ నామం అలా సడన్ గా ఎలా పోయింది?” అని అంటున్నారు. మరి కొంత మంది ఏమో, “ఆ గ్రాఫిక్స్ ఏంటి?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఇది మాత్రమే కాదు ఇలాంటి ప్రేక్షకుల ఓపికని పరీక్షించే సీన్స్ చాలానే ఉంటాయి. ఇంకా కొంత మంది అయితే “టేకింగ్ ఒక్కటి బాగుంటే సినిమా వేరే లాగా ఉండేది?” అని అంటున్నారు.

watch video :

ALSO READ : విగ్రహం మీద ఫైర్ అయిన బాహుబలి నిర్మాత..! ఏం అన్నారంటే..?


End of Article

You may also like