టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ నిలబెట్టిన మూవీ బాహుబలి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీలో ప్రభాస్ అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి గా నటించి మెప్పించారు. ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Video Advertisement

ఈ మూవీతో ప్రభాస్ అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ అమరేంద్ర బహుబలి వ్యాక్స్ విగ్రహాన్ని లండన్ మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. అయితే తాజాగా మైసూర్ మ్యూజియంలో పెట్టిన మైనపు విగ్రహాం పై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ మండిపడ్డారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బాహుబలి సినిమా అంతర్జాతీయంగా పలు దేశాలలో సంచలన విజయాన్ని అందుకుంది. రాజమౌళి దర్శకత్వం వహించగా, నిర్మాత శోభు యార్లగడ్డ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో విలన్ గా రానా దగ్గుబాటి నటించారు. హీరోయిన్లుగా అనుష్క, తమన్నా నటించారు. ఈ చిత్రం రెండు భాగాలుగా రిలీజ్ అయ్యి, సంచలన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం రిలీజ్ అయిన అన్ని భాషల్లో కూడా సెన్సేషనల్ హిట్ సాధించింది. దాదాపు 1500 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి సరికొత్త రికార్డ్ ను నమోదు చేసింది.
ఈ మూవీతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యారు. ఈ మూవీకి వచ్చిన క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ప్రభాస్ ‘బాహుబలి’ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే తాజాగా మైసూర్ లోని ఒక మ్యూజియంలో ఏర్పాటు చేసిన ‘బాహుబలి’ మైనపు బొమ్మకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ ‘బాహుబలి’ విగ్రహంలో ప్రభాస్ పొలికలు  లేకపోవడంతో ఫ్యాన్స్, నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
ట్రోలింగ్ నేపథ్యంలో ఈ విగ్రహం పై నిర్మాత శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు. అందులో “ఇది అధికారికంగా లైసెన్స్ తీసుకుని చేసిన పని కాదు. మా అనుమతి లేకుండా చేశారు. దీన్ని తొలగించేందుకు వెంటనే చర్యలు తీసుకుంటాం” అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

Also Read: “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” ఎన్నో సార్లు చూసినా…కానీ 6 డౌట్లు మాత్రం అలాగే మిగిలిపోయాయి..!