Ads
సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఆనంద్, మంచి కాఫీలాంటి మూవీ. ఈ మూవీలో రాజా, కమిలిని ముఖర్జీ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ సంచలన విజయాన్ని సాధించింది.
Video Advertisement
ఈ సినిమాలో నటించిన వారందరికీ మంచి గుర్తింపు లభించింది. ఈ మూవీలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ సమత పాత్రలో నటించింది. ఆమె పేరు బఖితా. ఈ మూవీలోని నటనకు గాను ఉత్తమ బాల నటి అవార్డు అందుకుంది. అయితే ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. ఆమె ప్రస్తుతం ఏం చేస్తుందో? ఎక్కడ ఉందో ఇప్పుడు చూద్దాం..
ఆనంద్ మూవీలో సమత అనే అల్లరి పిల్ల పాత్రలో నటించిన బాలనటి అసలు పేరు బఖితా ఫ్రాన్సిస్. 2004లో ఈ మూవీ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బఖితా ఫ్రాన్సిస్ ఉత్తమ బాల నటిగా నంది అవార్డు అందుకుంది. అయితే ఆమె ఈ మూవీ తరువాత మళ్ళీ వెండితెర పై కనిపించలేదు. ప్రస్తుతం ఆమె అమెరికాలో స్థిరపడినట్లు తెలుస్తోంది. బఖితాకు నటిగా మంచి ప్రతిభ ఉన్నప్పటికీ యాక్టింగ్ తన ఫ్యాషన్ కాదట. శేఖర్ కమ్ముల కోసమే సరదాగా ఆనంద్ మూవీలో నటించిందట.
బఖితా వయసు 26 ఏళ్ళు. ఆమె సమాజ సేవలో ప్రస్తుతం బిజీగా ఉంది. 17 ఏళ్ళ వయసు నుండే బఖితా ఫ్రాన్సిస్ మహిళల హక్కుల కోసం, సొసైటీలో మహిళలకు మగాళ్లతో సమనంగా హక్కులు కల్పించాలని పోరాడుతుంది. అలాగే అమ్మాయిల పై దాడులు గాని, అ-త్యా-చా-రా-లు జరగకుండా కఠిన చట్టాలను తీసుకురావాలని పోరాటం చేస్తోంది. సొసైటీకి ఉపయోగపడేలా ఏదైనా చేయాలనే ఉద్దేశ్యం తనను ఇలా ఆలోచించేలా చేసిందని అని వెల్లడించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బఖితా, తరచూ తన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. ఈ ఫోటోలను చూసిన కొందరు చాలా అందంగా ఉన్నారు. మళ్ళీ సినిమాల్లో నటించొచ్చు కదా అని అడిగితే, అది తనకు ఇష్టం లేదని బఖితా ఫ్రాన్సిస్ చెప్పారట.
Also Read: “రెబల్” సినిమాలో ఈ సీన్ గమనించారా..? ఇలా ఎలా చేశారు..?
End of Article