రూల్స్ చెప్తారు.. కానీ ఫాలో అవ్వరు..! “ఆచార్య” మూవీలో ఈ సీన్ గమనించారా..?

రూల్స్ చెప్తారు.. కానీ ఫాలో అవ్వరు..! “ఆచార్య” మూవీలో ఈ సీన్ గమనించారా..?

by kavitha

Ads

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య.  ఈ చిత్రానికి దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య గత ఏడాది రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.

Video Advertisement

విడుదలైన మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ పై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరిగింది. అయితే ఆచార్య మూవీలోని ఒక సీన్ గురించి నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మిర్చి, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భారత్ అనే నేను వంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ సినిమాలను తెరకెక్కించిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కీలక పాత్రలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారంటే అటు మెగా ఫ్యాన్స్, ఇటు ఇండస్ట్రీలో రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం అని అనుకున్నారు.  కొరటాల ఈ మూవీ కోసం ధర్మస్థలి అనే కొత్త ప్రపంచాన్ని కూడా సృష్టించారు.
chiru comments on aacharya movie flopఈ మూవీ 2022 మే 20న భారీ అంచనాల మధ్య, గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అయితే ఫస్ట్ షోతోనే ఈ మూవీ నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. నెటిజెన్లు ఈ మూవీని, దర్శకుడు కొరటాల శివను విపరీతంగా ట్రోల్ చేశారు. చిరంజీవి కెరీర్ లోనే మైనస్ అనే టాక్ కూడా వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయారు. అప్పట్లో అది కూడా పెద్ద చర్చకు దారి తీసింది.
ఈ మూవీలో చిరంజీవి ఆచార్య అనే నక్సల్ నాయకుడుగా నటించాడు. ఆచార్య కార్పెంటర్ వేషంలో ధర్మస్థలికి వస్తాడు. అయితే అక్కడికి ఎళ్లిన తరువాత కొందరు గుడి ముందు తాగుతూ ఉంటే, హీరో గుడి ముందు ఇలాంటివి  చెయ్యడం తప్పు అని చెబుతాడు. ఆ ఊరు అంతా గుడిలో పూజలు చేస్తారు. అయితే ఆ తరువాత నిమిషంలో హీరోనే సానా కష్టం వచ్చిందే అని ఐటెం సాంగ్ లో డాన్స్ చేస్తాడు. మరి హీరో చెప్పిన రూల్స్ ను ఆయనే పాటించరా అని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: “పుష్ప” సినిమాలో “చంద్రబాబు నాయుడు” గారు ఉన్నారు… ఈ సీన్ లో మీరు గమనించారా..?


End of Article

You may also like