Ads
సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినా, లేకపోతే గొప్ప కంటెంట్ ఉన్న సినిమాలు రిలీజ్ అయినా కూడా ఒక రకమైన సందడి ఉంటుంది. అది కూడా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన సినిమా అయితే ఇంకా ఒక రకమైన ఆసక్తి ఉంటుంది.
Video Advertisement
కానీ అసలు ఎటువంటి సందడి లేకుండా ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో టైటిల్ పాత్రలో మధుర్ మిట్టల్ నటించారు. ఇంకా ఈ సినిమా కథ విషయానికి వస్తే, 1940 లో తమిళనాడుకు చెందిన కొంత మంది వలసకి వెళ్లి, అందులో భాగంగా శ్రీలంకలో స్థిరపడతారు.
వారిలో ముత్తయ్య మురళీధరన్ కుటుంబం కూడా ఒకటి. అసలు ముత్తయ్య మురళీధరన్ కి క్రికెట్ మీద ఆసక్తి ఎలా ఏర్పడింది? తను క్రికెటర్ ఎలా అయ్యాడు? తమిళనాడుకు చెందిన వాడు అయిన ముత్తయ్య మురళీధరన్, శ్రీలంక జట్టుకి ఎందుకు కట్టుబడి ఉన్నాడు? తన జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు? ఆ తర్వాత గొప్ప క్రికెటర్ గా ఎలా అయ్యాడు? తన వ్యక్తిగత జీవితం ఎలా ఉండేది? ఈ విషయాలన్నీ ఈ సినిమాలో చూపించారు.
సాధారణంగా ఒక క్రికెటర్ బయోపిక్ అంటే అతను జీవితంలో సాధించిన ఘనతలు మాత్రమే చూపిస్తారు. కానీ ఈ సినిమాలో అందుకు కొంచెం భిన్నంగా ఆయన జీవితాన్ని చూపించారు. ముత్తయ్య మురళీధరన్ అనే ఒక వ్యక్తి పడిన కష్టాలని, అతని ఎదుర్కొన్న సమస్యలని, అతను ఎదుర్కొన్న అవమానాలు, అలాగే అతను దేశం కోసం ఆడిన విధానం ఇవన్నీ కూడా ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. అతను 800 వికెట్లు తీయడం, అతని బాల్యం ఇదంతా కూడా సినిమాలో చూపించారు. ముత్తయ్య మురళీధరన్ పాత్ర పోషించిన మధుర్ మిట్టల్ చాలా బాగా నటించారు.
ముత్తయ్య మురళీధరన్ ప్రవర్తించే విధానం చాలా బాగా ప్రాక్టీస్ చేశారు అని అతను నటిస్తున్న తీరు చూస్తేనే అర్థం అయ్యింది. మిగిలిన అందరూ కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించారు. జిబ్రాన్ అందించిన సంగీతం చాలా బాగుంది. అలాగే ఆర్ డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఒకరకంగా చెప్పాలి అంటే, క్రికెటర్ అంటే కేవలం గెలుపు మాత్రమే కాదు. ఆ గెలుపు పొందడానికి ఎంత కష్టపడ్డారు అనే విషయాలని కూడా చాలా బాగా చూపించిన సినిమాగా 800 సినిమా నిలుస్తుంది.
ALSO READ : RULES RANJANN REVIEW : “కిరణ్ అబ్బవరం” హీరోగా నటించిన ఈ సినిమా హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
End of Article