ఎన్టీఆర్ కి తెలుగుదేశం పార్టీ అభిమానుల షాక్..! ఏం జరిగిందంటే..?

ఎన్టీఆర్ కి తెలుగుదేశం పార్టీ అభిమానుల షాక్..! ఏం జరిగిందంటే..?

by kavitha

Ads

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అరెస్ట్ విషయంలో పై నందమూరి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, టిడిపి నాయకులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు మద్ధతుగా నిలిచారు.

Video Advertisement

ఇండస్ట్రీ నుండి కూడా కొందరు అరెస్ట్ ను ఖండించారు. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై స్పందించని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడిపి అభిమానులు, పలువురు తెలుగుదేశం నాయకులు ఎన్టీఆర్ పై తీవ్రంగా మండిపడుతున్నట్టు తెలుస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ అరెస్ట్ విషయంలో చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలుపకపోవడంతో సామాజిక మధ్యమాలలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ టీడిపి కార్యకర్తలు మధ్య వార్ జరుగుతోంది. ఈ క్రమంలోనే టీడిపి అభిమాని ఒకరు ఎన్టీఆర్ కు స్వయంగా కాల్ చేసి, ఎన్టీఆర్ చిత్రాల గురించి వార్నింగ్ ఇచ్చారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎన్టీఆర్ చంద్రబాబుకు మద్దతు తెలపకపోవడంతో ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ నటించిన చిత్రాలను ఆడనివ్వము అని గట్టిగా హెచ్చరించారట. వచ్చే ఎలెక్షన్స్ లో టీడిపి అధికారంలోకి వస్తుందని, ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రాలను ఆంధ్రప్రదేశ్ లో అసలు ఆడనివ్వము అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి వార్నింగ్ ఇస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు సైతం కౌంటర్ ఇచ్చారని సమాచారం. చంద్రబాబు అరెస్టు కావడంతో నెట్టింట్లో అభిమానుల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది.
అయితే ఎంతమంది ఎన్నిరకాలుగా విమర్శలు చేసినప్పటికీ, ఎన్టీఆర్ ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై స్పందించలేదు. ఇలా ఎన్టీఆర్ చంద్రబాబు విషయంలో స్పందించకపోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీ షూటింగ్ వర్క్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ నటిస్తోంది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు.

Also Read: “మా సినిమానే కాపీ కొట్టి మాకే చూపిస్తున్నారా..?” అంటూ… “లియో” మూవీపై కామెంట్స్..!


End of Article

You may also like