“మా సినిమానే కాపీ కొట్టి మాకే చూపిస్తున్నారా..?” అంటూ… “లియో” మూవీపై కామెంట్స్..!

“మా సినిమానే కాపీ కొట్టి మాకే చూపిస్తున్నారా..?” అంటూ… “లియో” మూవీపై కామెంట్స్..!

by kavitha

Ads

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లియో. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీగా పై ఇండియావైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. హిట్ పెయిర్ గా పేరుగాంచిన విజయ్ దళపతి, త్రిష పద్నాలుగేళ్ళ తర్వాత ఈ సినిమాలో జంటగా నటిస్తున్నారు.

Video Advertisement

తాజాగా విడుదల అయిన ఈ మూవ ట్రైలర్ సంచలనాలు సృష్టిస్తోంది. ఓవర్సీస్ లో బుకింగ్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ట్రైలర్ మూవీ పై మరిన్ని అంచనాలను పెంచింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ మూవీ ఆ తెలుగు సినిమా కాపీ అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ  తెలుగు సినిమా ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఖైదీ, మాస్టర్, విక్రమ్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన సంచలన దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఆయన సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి సినిమాలు కొన్నేళ్ళ నుండి  ఫలితాలతో సంబంధం లేకుండా భారీ కలెక్షన్స్ సాధించి రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. ఆయన సినిమాలకు తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. విజయ్ లేటెస్ట్ మూవీ లియో అక్టోబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఇటీవల కాలంలో  ఏ తమిళ సినిమాకి లేనంత హైప్ లియో సినిమా పై నెలకొంది. అయితే సోషల్ మీడియాలో ఈ మూవీ తెలుగు  సినిమా కాపీ అని చర్చ జరుగుతోంది. ఆ తెలుగు మూవీ ఏమిటంటే 2010లో వచ్చిన గాయం 2. రామ్ గోపాల్ వర్మ ఈ మూవీని సమర్పించగా, ప్రవీణ్ శ్రీ డైరెక్షన్ లో తెరకెక్కింది.
గాయం 2 మూవీని హాలీవుడ్ సినిమా ‘ఏ హిస్టరీ అఫ్ వయొలెన్స్’ ఆధారంగా తీశారు. కట్ చేస్తే, లియో ట్రైలర్ కి గాయం 2కి  పోలికలు ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయ్ హిల్ స్టేషన్ లో హోటల్ రన్ చేయడం, భయపడుతూ బ్రతకడం, ప్రత్యర్థులు వచ్చి అటాక్ చేస్తే తప్పించుకోవడం, ఆఖరికి ఎదురు తిరగడం లాంటివి ట్రైలర్ లో చూపించారు. ఆ సీన్స్ ని, గాయం 2 సీన్స్ ను పోలుస్తూ రెండింటి వీడియోస్ ను నెట్టింట్లో షేర్ చేస్తూ, కామెంట్లు చేస్తున్నారు.

https://twitter.com/gully_poragadu/status/1710889609088184487

Also Read: అనుష్క నుండి అనన్య వరకు… తెలుగు ఇండస్ట్రీకి “పూరి జగన్నాధ్” పరిచయం చేసిన 15 మంది హీరోయిన్లు వీరే.!


End of Article

You may also like