తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచిన డైరెక్టర్లలో పూరి జగన్నాధ్ ఒకరు. పూరి జగన్నాధ్ ఎంతో మంది హీరోలకి ఒక కొత్త స్టైల్ ఇచ్చారు. చాలా మంది హీరోలు పూరి జగన్నాధ్ తో సినిమా చూసిన తర్వాత స్టార్లు అయ్యారు. అలాగే పూరి జగన్నాధ్ ఎంతోమంది హీరోయిన్లని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

#1 రేణు దేశాయ్ – బద్రి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి సినిమాతో రేణు దేశాయ్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

#2 హన్సిక మోత్వానీ – దేశముదురు

చైల్డ్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న హన్సిక, దేశముదురుతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు.

#3 అనుష్క శెట్టి – సూపర్

నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో అనుష్క శెట్టి సినిమా రంగంలోకి ప్రవేశించారు.

#4 అసిన్ – అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి

రవితేజ సూపర్ హిట్ సినిమా అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి సినిమాలో అసిన్ హీరోయిన్ గా నటించారు.

#5 నేహా శర్మ – చిరుత

రామ్ చరణ్ మొదటి సినిమా చిరుతతోనే నేహా శర్మ కూడా హీరోయిన్ గా పరిచయం అయ్యారు.

#6 ముస్కాన్ సేథీ – పైసా వసూల్

బాలకృష్ణ హీరోగా నటించిన పైసా వసూల్ సినిమా తో ముస్కాన్ సేథీ తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.

#7 సమీక్ష – 143

పూరి జగన్నాధ్ తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా పరిచయం అయిన 143 సినిమాతో, సమీక్ష తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

#8 తను రాయ్ – ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం

ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమాతో తను రాయ్ కూడా హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టారు.

#9 సియా గౌతమ్ – నేనింతే

రవి తేజకి నంది అవార్డు తీసుకొచ్చిన నేనింతే సినిమాతో సియా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.

#10 దిశా పటాని – లోఫర్

బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని కూడా తెలుగు ఇండస్ట్రీలో, వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ సినిమాతో కెరీర్ మొదలు పెట్టారు.

#11 కేతిక శర్మ – రొమాంటిక్

ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో కేతిక శర్మ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

romantic movie review

#12 కేథరిన్ తెరెసా – ఇద్దరమ్మాయిలతో

అల్లు అర్జున్ హీరోగా నటించిన ఇద్దరమ్మాయిలతో సినిమాతో నటి క్యాథరిన్ తెరిసా తెలుగు సినిమాల్లో అడుగుపెట్టారు.

#13 నేహా శెట్టి – మెహబూబా

ఆకాష్ పూరి హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన మెహబూబా సినిమాతో నేహా శెట్టి హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టారు.

#14 అనన్య పాండే లైగర్

విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్న లైగర్ సినిమాతో అనన్య పాండే కూడా తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే కాకుండా, సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అవ్వబోతున్నారు.

#15 రక్షిత – ఇడియట్

రవి తేజ హీరోగా నటించిన ఇడియట్ సినిమా ద్వారా రక్షిత తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.

మీరు మాత్రమే కాకుండా ఇంకా ఎంతోమంది హీరోయిన్లని, అలాగే ఎంతోమంది నటీనటులని పూరి జగన్నాధ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు.