Ads
విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ ‘ఖుషి’. ఈ సినిమాకు డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ మీద నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మలయాళమ్యూజిక్ డైరెక్టర్ హిషామ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందించిన సాంగ్స్ అన్ని కూడా చార్ట్ బస్టర్స్ అయ్యాయి.
Video Advertisement
సెప్టెంబర్ 1న ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోగ్రాండ్ గా విడుదల అయ్యింది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రీసెంట్ గా ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ మూవీని చూసిన నెటిజెన్లు ఒక మిస్టేక్ ను గమనించి నెట్టింట్లో పోస్ట్ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి మూవీ. గతనేల రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్, ట్రైలర్లకు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక విజయ్ దేవరకొండ, సమంత చేసిన డ్యాన్స్ కు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఈ మూవీకి భారీ ఓపెనింగ్ కలెక్షన్స్ కు వచ్చాయి.
ఇటీవలే ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఒక ఓటీటీలో పలుమార్లు చూసిన నెటిజెన్లు ఆ మూవీలోనీ పొరపాట్లను గమనించి సోషల్ మీడియాలో షేర్ చేయడం, దానిని చూసిన నెటిజెన్లు కామెంట్లు పెట్టడం ఇటీవల కాలంలో సాధారణం అయ్యింది. వీటిలో కొన్ని వైరల్ గాను మారుతున్నాయి.
ప్రస్తుతం ఖుషీలో కూడా ఇలాంటి మిస్టేక్ ను గమనించిన ఒక యూజర్, దానికి సంబంధించిన వీడియో క్లిప్ ను షేర్ చేశారు. అందులో విజయ్ దేవరకొండ బైక్ నడుపుతుండగా సమంత వెనకాల కుర్చుని ఉన్నారు. విజయ్ దేవరకొండ తమను వెంబడిస్తున్న బైక్ ఎడమ వైపు పట్టుకుని పైకి లేపాడు. ఆ వీడియోను ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసి, బైక్ కి లెఫ్ట్ సైడ్ కూడా యాక్సిలరేటర్ ఉంటాయా అని క్యాప్షన్ ఇచ్చారు. దీనిపై నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
https://www.instagram.com/reel/Cx3LdPrJOqx/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D
Also Read: బాలకృష్ణ “భగవంత్ కేసరి” ట్రైలర్‌లో… ఈ 2 విషయాలే మైనస్ అయ్యాయా..?
End of Article