Ads
సినిమాల్లో చాలా రకాలు ఉంటాయి. అందులో సందేశాత్మక సినిమాలు కూడా ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు సందేశం అందించడానికి తీయకపోయినా కూడా అవి తెలిసి తెలియకుండా సినిమా చూస్తున్న ప్రేక్షకులకి ఒక నీతిని అందిస్తాయి.
Video Advertisement
ఇలాంటి విషయాల మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతాయి. సినిమా గురించి, అందులో చూపించిన వాటి గురించి చిన్న చిన్న వివరాలతో సహా చాలా డీటెయిల్ గా పరిశీలించి మాట్లాడుతారు. ఇటీవల సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా బేబీ.
సినిమాని చూసి కొంత మంది, “చాలా బాగుంది” అంటే, మరి కొంత మంది మాత్రం, “సినిమా మొత్తం వన్ సైడ్ మాత్రమే చూపించినట్టు ఉంది” అని అన్నారు. కానీ దర్శకుడు చెప్పడానికి ప్రయత్నించిన విషయం ఒకటే. ఇందులో లీడ్ రోల్స్ లో నటించిన ముగ్గురు కూడా కరెక్ట్ గా ఉండరు. ఏదో ఒక సమయంలో ఏదో ఒక తప్పు చేశారు.
తెలిసి తెలియని వయసులో వాళ్ళు చేసిన తప్పుల వల్ల తర్వాత వాళ్ళు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి అనే విషయాన్ని ఈ సినిమాలో దర్శకుడు చూపించడానికి ప్రయత్నించారు. అయితే ఈ సినిమా ద్వారా మనకి అందిన నీతి ఏంటి అని కోరాలో ఒక వ్యక్తి ప్రశ్న పోస్ట్ చేశారు. ఈ ప్రశ్నకి సంతోష్ కుమార్. కె అనే ఒక వ్యక్తి ఈ విధంగా సమాధానం చెప్పారు.
ఈ ప్రశ్నకి సంతోష్ కుమార్ గారు మాట్లాడుతూ, “ఓ అరవై ఐదేళ్ల ఏళ్ల క్రితం కాలాతీత వ్యక్తులు అనే నవల వచ్చింది … చాలా పాపులర్ నవల అది … కాలాతీత వ్యక్తులు అంటే కాలానికి ఎదురు నిలిచి గెలిచే వారుగా పేర్కొనవచ్చు (తప్పులున్నచో పెద్దలు సవరించగలరు ) ఈ నవల లో ఇందిర అనే ఓ పాత్ర ఉంటుంది …ఆ పాత్ర ఎంత బోల్డ్ గా ఉంటుంది అంటే … మొదట ప్రకాశం అనే పాత్ర తో ప్రేమాయణం నడిపి … ఆ తరువాత కృష్ణ మూర్తి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది …
ఈ మధ్యలో చాలా ప్రాసెస్ నడుస్తుంది …ప్రేమాయణం లో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా చెప్పబడతాయి . ఇందిర వ్యక్తిత్వం తెలిసి ఓ సమయం లో కృష్ణ మూర్తి పాత్ర భయపడేంతగా ఉంటుంది. నవల పేరులో పేర్కొన్న ట్టుగా కాలాతీత వ్యక్తులు లో ఒకరిగా అంటే లీడ్ రోల్ లో ఇందిర పాత్ర ను చూపిస్తారు … మిగిలిన కాలాతీత వ్యక్తులు వేర్వేరు మంచి లక్షణాలతో ఉంటారు …
ఇక్కడ గెలుపే కొలమానం అయినప్పుడు ఆమె పాత్ర లో లోపాలు ఎంచలేము … మొదటి సారి ఈ పుస్తకం (అంటే మాకు డిగ్రీ లో తెలుగు నవల గా ఉండేది ) చదివినప్పుడు నాకు కొంత అదోలా అనిపించినా … తరువాత లీడ్ రొలెస్ కి పాఠం చివరలో ఇచ్చిన జస్టిఫికేషన్ చదివాకా కొంత సంతృప్తిగానే అనిపించింది.”
పైన ఫోటో లో సినిమా (ఊహలు గుసగుసలాడే) చూసే ఉంటారు … హీరోఇన్ మొదట హీరో ని ప్రేమిస్తుంది … ఆ తరువాత మరొకరి తో పెళ్ళికి సిద్ధపడుతుంది… ఏంటని హీరో అడిగితె ఓ డైలాగు చెపుతుంది … నా కాళ్ళు / పాదాలు ఎప్పుడూ నేల మీద ఉంటాయి … అది తనలోని ప్రాక్టికల్ వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది.
ఆకలి రాజ్యం (ఈ సినిమాలోని, “ఎలాగోలా బతకాలనుకుంటే ఎలాగైనా బతకవచ్చు. కానీ ఇలాగే బతకాలి అనుకున్నాను. అది వీలు పడదు ఈ దేశంలో” అనే డైలాగ్ ఫోటో పోస్ట్ చేసి) పైన డైలాగ్ కి అర్థం వివరించక్కర్లేదు అనుకుంటా ! ఇప్పుడు పైన పేర్కొన్న మూడు ఉదాహరణలు తరచి చూస్తే బేబీ సినిమా పైన క్లారిటీ వస్తుంది అనుకుంటా…. అయితే మీకు ఏం అర్థం అయిందనేది మీ ఇంట్యూషన్ పైన ఆధారపడి ఉంటుంది.” అని రాశారు. ఈయన చెప్పిన మాట కూడా నిజమే కదా. ఇదే మీలో ఎంత మందికి అనిపించింది.
ALSO READ : “పవన్ కళ్యాణ్” లాగానే… తమ సినిమాలని తామే “డైరెక్ట్” చేసుకున్న 10 హీరోస్..!
End of Article