హెబ్బా పటేల్ నటించిన ఈ సినిమా చూశారా..? ఎలా ఉందంటే..?

హెబ్బా పటేల్ నటించిన ఈ సినిమా చూశారా..? ఎలా ఉందంటే..?

by kavitha

Ads

రియల్ లైఫ్ లో జరిగిన సంఘటనల ఆధారంగా ఇప్పటివరకు చాలా చిత్రాలు తెరకెక్కాయి. మరణిస్తే, తిరిగి బ్రతికించవచ్చని, మరణించిన పై లోకంలో ఉన్న తమకు బాగా ఇష్టం అయిన వ్యక్తులను మళ్ళీ తీసుకుని రావొచ్చు అనే మూఢ విశ్వాసంతో కొందరు సామూహికంగా చనిపోయిన సంఘటనల గురించిన వార్తలు ఎక్కడో ఒక చోట చూసే ఉంటారు.

Video Advertisement

అలాంటి ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ది గ్రేట్ ఇండియన్ సూ-సై-డ్’. ఈ మూవీ తెలుగు ఓటీటీ ఆహాలో అక్టోబర్ 6 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. హీరోయిన్ హెబ్బా పటేల్ లీడ్ రోల్ లో నటించిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో రామ్ కార్తిక్, సీనియర్ నరేష్, పవిత్రా లోకేష్, సాయికుమార్ బబ్లూ వంటివారు కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి విప్లవ్ కోనేటి దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, అనాధ అయిన హేమంత్ (రామ్ కార్తీక్) తన స్నేహితుడితో కలిసి ఒక కాఫీ షాప్ ని నడిపిస్తుంటాడు.  ఆ షాప్ కి చైత్ర (హెబ్బా పటేల్) తరచు కూకీస్ తీసుకువస్తుంది. ఈ క్రమంలో హేమంత్ చైత్రను ప్రేమిస్తాడు. ఆ  విషయాన్ని చైత్రకు చెప్తాడు.
అయితే ఆమె హేమంత్ లవ్ ని రిజెక్ట్ చేస్తుంది. దాంతో హేమంత్ ఆమె జ్ఞాపకాలను మర్చిపోవడానికి ఆ ఊరు వదిలి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. ఆ సమయంలో హేమంత్ ను తనుకూడా ప్రేమిస్తున్నట్టుగా చైత్ర చెప్తుంది. కానీ తాను అతన్ని పెళ్లి చేసుకోలేనని, ఎందుకంటే త్వరలో తాను, తన కుటుంబం అంతా ఒకేసారి ఆ-త్మ-హ-త్య చేసుకోబోతున్నామని చెప్తుంది. విషయం విని హేమంత్ షాక్ అవుతాడు. చైత్ర మరియు ఆమె కుటుంబం మొత్తం ఎందుకు సూ-సై-డ్ చేసుకోవాలని అనుకున్నారు? చైత్ర చెప్పింది విన్న హేమంత్ ఏం  చేసాడు? చివరికి ఏం జరిగింది? అనేది మిగిలిన స్టోరీ.
దర్శకుడు ఎంచుకున్న స్టోరీ లైన్ ను తెరపై చూపించడంలో చాలావరకు సక్సెస్ అయ్యారు. హెబ్బా పటేల్ చైత్ర పాత్రకు  న్యాయం చేసింది. హీరోగా నటించిన రామ్ కార్తిక్ తన పరిధి మేరకు నటించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారు ఈ మూవీని చూడవచ్చు.

Also Read: “బేబీ సినిమా నుండి నేర్చుకున్న నీతి ఏమైనా ఉందా..?” అనే ప్రశ్నకి… ఈ వ్యక్తి ఏం సమాధానం చెప్పారో తెలుసా..?


End of Article

You may also like