Ads
గుప్పెడంత మనసు సీరియల్ బుల్లితెర ఆడియెన్స్ ను ఎంతగానో అలరిస్తున్న సీరియల్. జగతి మేడమ్, రిషి, వసుధార, మహేంద్ర వంటి పాత్రలతో, వారి మధ్య ఉండే ఎమోషనల్ సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న ఈ సీరియల్ లో కొద్ది రోజులుగా ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తున్నారు.
Video Advertisement
జగతి మేడమ్ రిషి, వసుధారాలకు పెళ్లి జరిపించి, కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇప్పుడు జగతి మేడమ్ స్థానంలోకి ఎవరు వస్తారు ? గుప్పెడంత మనసు సీరియల్ లో కొత్త ట్విస్ట్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..జగతి కన్నుమూయడంతో ఆమెనే తలుచుకుంటూ మహేంద్ర తాగి రోడ్డు పక్కన పడిపోతాడు. ఆ విషయం వేరేవాళ్ల ద్వారా తెలుసుకున్న రిషి, వసుధార మహేంద్ర గగగరికి వెళ్తారు. చెట్టుకింద ఉన్న మహేంద్రను అలా చూసి బాధపడుతూ, ఇంటికి తీసుకొని వస్తారు. అది చూసిన దేవయాని మహేంద్ర పై కోప్పడుతుంది. దాంతో ఫణీంద్ర భార్యపై ఫైర్ అవుతాడు.తరువాతి రోజు ఫణీంద్ర, జగతి లేదనే బాధలో ఉండి, చేసే పనులు, బాధ్యతల్ని పట్టించుకోకపోతే తమనే నమ్మకున్న విద్యార్ధులు, ఉద్యోగుల జీవితాలు ఇబ్బందిలో పడతాయని రిషితో అంటాడు. ఇవన్నీ తొలగిపోవాలంటే ఎండీ సీట్‌లో నువ్వే కూర్చోవాలని రిషిని, దేవయాని, శైలేంద్రల ముందే రిక్వస్ట్ చేస్తాడు. దానికి చేయలేనని రిషి చెప్తాడు. వసు కలుగజేసుకుని, మీ పైన పడిన నింద గురించే కదా, కానీ దాని గురించి ఇకపై ఆలోచించాల్సిన అవసరం లేదు సార్. దాన్ని గురించి బాధ పడాల్సిన అవసరం లేదు అని అంటుంది.
రిషి ఏం చెప్తున్నావు వసుధారా అని అడుగుతాడు. వసుధార మాటలు అర్ధం కానీ శైలేంద్ర, దేవయానీలు షాకింగ్‌గా చూస్తారు. వసుధార మాట్లాడుతూ, తాను, ఫణీంద్ర సార్ కలిసి ఎస్ఐ గారిని మరియు మినిస్టర్ గారిని కలిసి, సమస్యను సాల్వ్ చేశామని చెప్తుంది. ఇక రిషిని ఎండీ సీట్‌లో చూడాలని ఫణీంద్ర, వసుధార బలంగా కోరుకుంటున్నారు కాబట్టి తరువాతి ఎపిసోడ్‌లో దేవయాని, శైలేంద్రల షాక్ ఇస్తూ రిషి ఎండీ సీట్ ని స్వీకరిస్తాడో చూడాలి.
Also Read: చనిపోతూ షాక్ ఇచ్చిన గుప్పెడంత మనసు “జగతి మేడమ్”..! ఈ ట్విస్ట్ ఏంటి..?
End of Article