గుప్పెడంత మనసు స్టార్ మాలో ప్రసారం అవుతున్న పాపులర్ సీరియల్‌. ఈ సీరియల్ ద్వారా పలువురు నటీనటులకు మంచి గుర్తింపు వచ్చింది. వారికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా రిషి, వసుధార, మహేంద్ర, జగతి మేడమ్. వీరిలో జగతి మేడమ్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది.

Video Advertisement

గత కొన్ని ఎపిసోడ్ లుగా జగతి అనారోగ్యంతో హస్పటల్  లో ఉండడం, ఆ తరువాత రిషి అమ్మా అని పిలవడంతో ఫ్యామిలీ కలిసిపోతుంది. అయితే జగతి రిషి, వసు పెళ్లి జరిగిన వెంటనే జగతి కన్నుమూస్తుంది. అయితే చనిపోయే ముందు దేవయాని, శైలేంద్రలకు ట్విస్ట్ ఇచ్చింది. అదేమిటో ఇప్పుడు చూద్దాం..
పెళ్లి దుస్తులతో రెడీ అయ్యి, వచ్చిన రిషీతో జగతి ఒక విషయం చెప్పాలని పిలుస్తుంది. ఏంటమ్మా? అని అడిగిన రిషితో ‘నా తరువాత మహేంద్రకు అన్నీ నువ్వే అవ్వాలి’ అని అంటుంది. ‘మహేంద్రకు ఎల్లప్పుడు నువ్వు తోడు ఉండాలి, ఎప్పుడూ వదిలిపెట్టొద్దు. తోడు ఉండాల్సిన సమయంలో ఎప్పుడు తోడుగా లేను.
ఇక ఇప్పుడు ఉంటానో లేదో తెలియదు. మీ నాన్నకి మంచి భార్యను కాలేకపోయాను. కానీ నువ్వు మాత్రం గొప్ప కుమారుడిగా ఉండి, ఆయనను ఆనందంగా చూసుకో’ అని జగతి ఎమోషనల్‌ అవుతుంది. అప్పుడు రిషి తప్పక కుండా చూసుకుంటానమ్మా అని చెప్తాడు. ఆ తరువాత రిషి, వసుల వివాహం జరుగుతుంది.
ఇద్దరు దేవయాని వాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకుని, ఆ తరువాత  జగతి దగ్గర ఆశీర్వాదం కోసం మోకాళ్ల మీద కూర్చుంటారు. అప్పుడు జగతి రిషీతో  ‘ఇక నుండి మెషన్ ఎడ్యుకేషన్ కూడా మీ చేతుల్లోనే పెడుతున్నాను’ అని చెప్తుంది. అది విని షాక్ అయిన దేవయాని, శైలేంద్రలు కోపంతో చూస్తుంటారు. ఆ తరువాత జగతి ఇద్దరి పై అక్షింతలు వేసి, రిషి తల పై చేయి పెట్టి ఆశీర్వాదిస్తూ, అలానే కన్ను మూస్తుంది.

Also Read: 30 ఏళ్ల స్టార్ డం… కానీ ఇప్పుడు..? అసలు ఈ హీరోయిన్ పరిస్థితి ఎందుకు ఇలా అయ్యింది..?