Ads
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇరువైపుల వాదనలు వినిపించారు. అందువల్ల ఈ రోజు తీర్పు వస్తుందని అందరూ భావించారు. కానీ అత్యున్నత న్యాయస్థానం మరోసారి వాయిదా వేసింది.
Video Advertisement
ఇక ఫైబర్నెట్ కేసులో చంద్రబాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కూడా సుప్రీంకోర్టు మంగళవారానికి విచారణ వాయిదా వేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫు లాయర్ లూథ్రా తన వాదనలు వినిపించారు. ఫైబర్ నెట్ కేసులో ఇప్పటికే ముగ్గురికి ముందస్తు బెయిల్ ఇచ్చారని, ఇద్దరికి సాధారణ బెయిల్ ఇచ్చారని తెలిపారు. ఈ కేసులో కొందరికి ముందస్తు బెయిల్, కొందరికి రెగ్యులర్ బెయిల్ ఇచ్చినప్పుడు, చంద్రబాబుకు ఎందుకు బెయిల్ ఇవ్వరని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు.
జస్టిస్ అనిరుద్ద బోస్ ఫైబర్ నెట్ కేసులో సెక్షన్ 17ఏ ప్రస్తావన ఉండడం వల్ల తరువాతి విచారణను అక్టోబర్ 17 మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్లుగా వెల్లడించారు. దాంతో అక్టోబర్ 17కి విచారణ వాయిదా వేయటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. పీటీ వారంట్ ప్రకారం చంద్రబాబు నాయుడును సోమవారం నాడు ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నారని, ఆ రోజు హాజరుపరిస్తే చంద్రబాబుని అరెస్ట్ చేస్తారని, లూథ్రా న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. దాంతో జస్టిస్ బోస్ మాట్లాడుతూ ఆర్డర్ ను పాస్ చేయడం లేదు.
కానీ సోమవారం దాకా చంద్రబాబును అరెస్టు చేయవద్దని సీఐడీ తరఫు లాయర్ రోహత్గీకి చెప్పారు. 17ఏ పై వాదనలు పూర్తి కాలేదు. అందువల్ల ఫైబర్ నెట్ కేసులో ఆర్డర్స్ ఇవ్వలేమని తెలిపారు. అయితే, సోమవారం నాడు చంద్రబాబు అరెస్ట్ చేయరని సీఐడీ తరపున ముకుల్ రోహత్గి హామీ ఇచ్చారు. ఫైబర్ నెట్ కేసును విజయవాడ ఏసీబీ కోర్టులో బుధవారానికి వాయిదా వేయమని సమాచారం ఇస్తామని సీఐడీ తరఫు లాయర్ రోహత్గీ సుప్రీంకోర్టుకు తెలిపారు.
Also Read: చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వినిపించిన వాదనలు ఏమిటంటే..?
End of Article