“గుప్పెడంత మనసు” సీరియల్ లో ఇంకో పెద్ద షాక్..! ఇలా ఎందుకు చేశారు..?

“గుప్పెడంత మనసు” సీరియల్ లో ఇంకో పెద్ద షాక్..! ఇలా ఎందుకు చేశారు..?

by kavitha

Ads

గుప్పెడంత మనసు సీరియల్ గత కొన్ని రోజులుగా ఆసక్తికరంగా సాగుతోంది. దేవయాని, శైలేంద్ర కాలేజీని పొందడం కోసం ఎన్నో కుట్రలు చేసి, జగతి మేడమ్ ను కూడా చంపేశారు. అయినా ఇంకా కాలేజీ కోసం వారి కుట్రలు కొనసాగుతున్నాయి.

Video Advertisement

జగతి చనిపోయిన బాధలో ఉన్న రిషి నేటి ఎపిసోడ్ లో తండ్రి మహేంద్రను, వసుధారను తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. అసలేం జరిగింది? రిషి ఎందుకు ఇంట్లో నుండి వెళ్లిపోయాడు అనేది ఇప్పుడు చూద్దాం..
ఈరోజు ఎపిసోడ్ లో డిన్నర్ చేయడానికి అందరూ కూర్చుంటారు. ఆ సమయంలోనే మహేంద్ర బాగా తాగి, తులుతూ  ఇంటికి వస్తాడు. కింద పడిపోబోతుంటే, రిషి పరుగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకుంటాడు. ధరణీ, వసు, శైలేంద్ర, ఫణేంద్ర అక్కడికి వెళతారు. మహేంద్ర రిషీతో నువ్వు న్నాను పడి పోనివ్వవు అని తెలుసు నాన్నా, నువ్వు ఉన్నావనే  నాకు ధైర్యం నాన్నా అంటూ మాట్లాడుతూ ఉంటాడు. రిషి, మహేంద్రను లోపలికి రమ్మని పిలుస్తాడు. దానికి మహేంద్ర ఇంటికి రాకూడదని అనుకున్నాను.
కానీ నువ్వు నా గురించి రోడ్డు పైన వెతుకుతుంటావు ఉంటావు. అందుకే నువ్వు బాధపడతావని ఇంటికి వచ్చాను నాన్నా అంటూ కన్నీరు పెట్టుకుంటాడు. తండ్రిని అలా చూసి రిషి బాధపడుతాడు. వసు, ధరణీ, ఫణేంద్ర బాధ పడుతుంటే, దేవయానికి శైలేంద్ర సైగ చేస్తాడు. దాంతో దేవయాని మహేంద్ర తాగి ఇంటికి వచ్చినందుకు మండిపడుతుంది. తన మాట‌ల‌తో మహేంద్రని దేవ‌యాని అవ‌మానిస్తుంది. జగతి సమయం అయిపోవడంతో,  వెళ్ళిపోయింది.4 రోజులు ఏడ్చి, ఆ విషయాన్ని మర్చిపోయి, పనులు చేసుకోవాలి. కానీ రోజు తాగి ఇంటికి వస్తుంటే, ఎలా ఉంటుంది. బాధ ఉంటే, తాగి తందనాలు ఆడాలా? అని కోపంగా దేవయాని అనడంతో రిషికి చాలా కోపం వస్తుంది. దేవయాని కోపంగా ఇక ఈ ఇంట్లో ఉండలేను,ఈ దారణం రోజు చూడలేను అని అంటుంది. దాంతో కోపంగా ఉన్న రిషి పెద్దమ్మా మీరు బయటకు వెళ్లనవసరం లేదు. మేమే వెళ్తాం అంటూ రిషి తండ్రిని, భార్యని తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతాడు.

Also Read: ఓటీటీని కుదిపేస్తున్న కరీంనగర్ కుర్రాడు ప్రజ్ర్ఞన్


End of Article

You may also like