Ads
ప్రస్తుతం తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాలలో లియో ఫీవర్ నడుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా, లొకేష్ కనకరాజ్ కాంబో కావడంతో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కమల్ హాసన్ కు విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన దర్శకుడు లోకేష్.
Video Advertisement
లొకేష్ కనకరాజ్ ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లోను అభిమానులను సొంతం చేసుకున్నారు. లొకేష్ కు తెలుగులో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఆయన తెలుగు నటుడితో తన మొదటి సినిమాను తెరకెక్కించారు. మరి ఆ సినిమా ఏమిటో? ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..
కోలీవుడ్ సంచలన దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెలుగు ఆడియెన్స్ కు ఖైదీ మూవీతో పరిచయం అయ్యారు. ఆ తరువాత మాస్టర్, విక్రమ్ సినిమాలతో పెద్ద సంఖ్యలో అభిమానులు అయ్యారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ ఫ్రాంచైజీలో వచ్చే సినిమాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే లోకేష్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా కార్తీ నటించిన ఖైదీ మూవీ అని చాలామంది అనుకుంటారు. అయితే ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి సినిమా మానగరం. ఈ చిత్రం 2017 లో తమిళంలో రిలీజ్ అయ్యి, విజయం సాధించింది. ఆ సినిమానే తెలుగులో ‘నగరం’ పేరుతో రిలీజ్ చేశారు. ఈ మూవీలో తెలుగు యంగ్ హీరో సందీప్ కిషన్, రెజీనా కసాండ్రా, శ్రీ నటించారు. ఈ మూవీ కథ విషయానికి వస్తే, శ్రీ అనే యువకుడు జాబ్ కోసం నెల్లూరు నుంచి చెన్నైకి వస్తాడు. ఒక సాఫ్ట్‌వేర్ సంస్థకి అతనికి జాబ్ వస్తుంది. రెజీనా అదే కంపెనీలో హెచ్ఆర్. ఆమె క్లాస్‌మేట్ అయిన సందీప్ కిషన్ లవ్ చేస్తున్న అంటూ వెంటపడుతుంటాడు. రెజీనాకు అతనంటే ప్రేమ ఉన్నా, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుండడం ఆమెకు నచ్చదు. సందీప్ తో గోడవపడిన కొందరు సందీప్ అనుకొని శ్రీని కొడతారు.
అయితే ఆ గొడవలో అతని ఒరిజినల్ సర్టిఫికేట్స్ పోతాయి. అతను జాబ్ లో చేరాలంటే సర్టిఫికేట్స్ అవసరం. ఇది ఇలా ఉంటే, ఆ నగరంలో కొందరు గూండాలు ఒక అబ్బాయిని కిడ్నాప్ చేయాల్సింది. పొరపాటునా ఆ ప్రాంత డాన్ పీకేపీ(మధుసూదన్) అబ్బాయిని కిడ్నాప్ చేస్తారు. ఆ నగరానికి క్యాబ్ డ్రైవర్ గా పనిచేయడం కోసం వచ్చిన చార్లే పీకేపీకి సంబంధించిన కారును రెంట్ కు తీసుకుంటాడు. సందీప్ కి రౌడీలతో ఉన్న గొడవ ఏమిటి? శ్రీ సర్టిఫికేట్స్ దొరికాయా? రెజీనా, సందీప్ ల ప్రేమ ఫలిస్తుందా? చివరికి ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.
Also Read: ఇప్పటి వరకు చూడని పవర్ స్టార్ “పవన్ కళ్యాణ్” అరుదైన ఫోటోలు..!
End of Article