వామ్మో నాని ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడా…!

వామ్మో నాని ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడా…!

by Mounika Singaluri

Ads

నాచురల్ స్టార్ నాని గురించి మనందరికీ తెలిసిందే. తన న్యాచురల్ యాక్టింగ్ తో మన ఇంటి పక్క కుర్రాడిలా అనిపిస్తూ తన సినిమాలతో అందరికీ దగ్గరయ్యాడు. అష్టా చమ్మా సినిమాతో హీరోగా నాని ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు తిరుగులేని స్టార్ డం ని తన సొంతం చేసుకున్నాడు.

Video Advertisement

నాని కెరీర్ లో చాలావరకు సినిమాలు హిట్లుగానే నిలిచాయి. నానితో సినిమా చేస్తే చాలు ప్రాఫిట్ లు వస్తాయని గ్యారంటీ వచ్చేసింది. దాంతో ప్రొడ్యూసర్లు అందరూ నాని వెంట క్యూ కట్టారు. టాలీవుడ్ లో బడా బ్యానర్ అయిన గీత ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్, డివిడి మూవీస్, దిల్ రాజు బ్యానర్ ఇలా అందరూ నానితో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

నానికి ఉన్న క్రేజ్ కి ఏకంగా బాలీవుడ్ లోని స్టార్ ప్రొడక్షన్ హౌజ్ యాష్ రాజ్ ఫిలిమ్స్ నానితో సినిమా తీసింది అంటేనే అర్థం అవుతుంది నానికి ఉన్న రేంజ్.ప్రస్తుతం నాని హాయ్ నాన్న అనే మూవీ రిలీజ్ కి సిద్ధం చేశాడు. డిసెంబర్ 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా టీజర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. టీజర్ కూడా ఆద్యంతం ఆహ్లాదకరంగా ఆకట్టుకునే విధంగా ఉంది.

వరుస పెట్టి సినిమాలు చేస్తున్న నాని తన మార్కెట్ కూడా పెరగడంతో అమాంతం తన రెమ్యూనరేషన్ ని పెంచేశాడు. నాని నెక్స్ట్ లైన్ అప్ లో తమిళ్ డైరెక్టర్ సిబి చక్రవర్తితో చేయనున్నారు. ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మించనున్నారు. అయితే ఈ మూవీ రెమ్యూనరేషన్ కింద నానికి రూ. 25 కోట్లు చెల్లిస్తున్నారని ఇండస్ట్రీ ట్రాక్. దీన్ని మూడు వాయిదాల్లో చెల్లించడానికి అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారు.ఏదేమైనా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తన సినిమాలతో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న నాని ఇప్పుడు తన రెమ్యూనికేషన్ తో కూడా హాట్ టాపిక్ అయ్యాడు.


End of Article

You may also like