ఎన్టీఆర్ పేరు మీద విడుదల చేసిన కాయిన్ చెల్లదా..? కారణం ఏంటంటే..?

ఎన్టీఆర్ పేరు మీద విడుదల చేసిన కాయిన్ చెల్లదా..? కారణం ఏంటంటే..?

by Mounika Singaluri

Ads

నందమూరి తారక రామారావు ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు. కేవలం తెలుగు వారికే కాదు భారతదేశమంతటా ఈ పేరు ప్రసిద్ధి చెందినది. సినీ నటుడుగా తెలుగు సినిమా చరిత్రలో చిరకాలం నిలిచిపోయే పేరు నందమూరి తారక రామారావు.

Video Advertisement

కేవలం సినిమా నటుడుగానే కాకుండా ఆయన రాజకీయాలకు వచ్చి తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది నెలలోనే ముఖ్యమంత్రి ఈ రికార్డు సృష్టించారు. ఆయన ఆశీస్సులతో నందమూరి కుటుంబం నుండి ఎందరో రాజకీయాల్లోనూ సినిమాల్లోనూ రాణిస్తున్నారు.

ఎన్టీఆర్ వారసులుగా వచ్చిన నందమూరి హరికృష్ణ నందమూరి బాలకృష్ణ తమ ప్రతిభను చాటుకుని అభిమానులను సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ మనవళ్లయిన నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి తారకరత్న, జూనియర్ ఎన్టీఆర్ అయితే స్టార్ స్టేటస్ ని అనుభవిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరి భర్త చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ మరణం తర్వాత తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. ఎన్టీఆర్ మరో కుమార్తె పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు ఎన్టీఆర్ చేసిన సేవలకు గుర్తింపుగా ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన పేరుమీద 100 రూపాయల నాణెం ని విడుదల చేసింది. ఆగస్టు 30,2023 నుండి ఈ నాణేలు విక్రయాలు ఆర్బిఐ కొనసాగించింది. ఎన్టీఆర్ అభిమానులు తెలుగు ప్రజలు ఈ నాణెం ను దక్కించుకోవడానికి పోటాపోటీగా క్యూ కట్టారు.

అయితే ఈ నాణెంని మనం ఎక్కడా ఉపయోగించడానికి వీలుపడదు. ఎందుకంటే భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ప్రముఖుల పేర్లు మీద విడుదల చేసిన నాణాలను కేవలం వారి గుర్తుగా దాచుకోవడం తప్పితే మారకానికి ఏమి ఉపయోగపడవు. ఇది వారికి భారత ప్రభుత్వం అందిస్తున్న గౌరవము గుర్తింపు మాత్రమేనని ఆర్బిఐ తెలియజేసింది.ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు ఈ నాణెంలని సొంతం చేసుకుని తమ వద్ద భద్రపరుచుకున్నారు.
ఆర్బిఐ ఈ కాయిన్లను విడతల వారీగా విడుదల చేస్తూ ఉంటుంది

Also Read:ఈ సీన్ ఎందుకు పెట్టారు..? ఇంత ఓవర్ గా చేయడం అవసరమా..?” అంటూ… రవితేజ “టైగర్ నాగేశ్వరరావు” మూవీ మీద కామెంట్స్..!


End of Article

You may also like