Ads
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోని డైరెక్ట్ చేయాలంటే మినిమం నాలుగైదు హిట్లు కొట్టి ఉండాలి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఎవరికో గాని రాదు. సీనియర్ డైరెక్టర్లు అయిన రాఘవేంద్రరావు, వివి వినాయక్, బోయపాటి శ్రీను శ్రీనువైట్ల, రాజమౌళి, కొరటాల శివ, సుకుమార్ ఇలాంటి స్టార్ డైరెక్టర్ కి మాత్రమే సీనియర్ హీరోలు ఛాన్సులు ఇచ్చేవారు.
Video Advertisement
ఇప్పుడు సీనియర్ హీరోలు కూడా తమ పంథాని మార్చారు. వరుస పెట్టి కుర్ర డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తూ సినిమాలు తీయడం మొదలుపెట్టారు. ఒకటి అరా హిట్ కొట్టిన కుర్ర డైరెక్టర్ ఇప్పుడు సీనియర్ హీరోలు అందరినీ డైరెక్ట్ చేయడానికి రెడీ అయిపోతున్నారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి మెగా 156 సినిమాని ప్రారంభించారు. దసరా సందర్భంగా మ్యూజిక్ సిట్టింగ్లతో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ యు వి క్రియేషన్స్ నిర్మించనుంది. ఈ సినిమాకి బింబిసారా వంటి సినిమాతో హిట్ కొట్టిన వశిష్ట దర్శకత్వం వహించనున్నారు. కేవలం ఒక్క సినిమా తోటే మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు.
భగవంత్ కేసరి సినిమాతో హిట్ కొట్టిన నందమూరి బాలకృష్ణ కూడా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఛాన్స్ ఇచ్చారు. ఆరు సినిమాలు డైరెక్ట్ చేసినా కూడా అనిల్ రావిపూడి వయసులో చిన్నవారే. బాలయ్య తన మీద పెట్టుకొని నమ్మకాన్ని అనిల్ రావిపూడి నిరూపించి చూపించారు.
విక్టరీ వెంకటేష్ ఎప్పుడు కొత్త సినిమాలు తో ముందుకు వస్తూ ఉంటారు. ఆయన కూడా యంగ్ డైరెక్టర్ల వెంటపడ్డారు. ప్రస్తుతం ఆయన శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా దర్శకుడు ఇంతకుముందు హిట్1, హిట్ 2 సినిమాలతో హిట్లు కొట్టారు. ఈయనకు ఇది మూడో సినిమా.
తన కెరీర్ లో ఎక్కువ మంది యంగ్ డైరెక్టర్ లతో వర్క్ చేసిన హీరో అక్కినేని నాగార్జున. ప్రస్తుతం నాగార్జున నా సామిరంగా అనే మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకి ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ డైరెక్షన్ చేస్తున్నారు. ఆయనకి ఇది మొదటి సినిమా కావడం విశేషం.
Also Read:నివేతా థామస్ లాగే… ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 12 హీరోయిన్స్.!
End of Article