Ads
టాలీవుడ్ లో స్టార్ యాంకర్ సుమ గురించి తెలిసింది. తన మాటలతో వాక్చాతుర్యంతో అందరిని కట్టిపడేస్తూ ఉంటారు. ఏదైనా ఈవెంట్లో సుమ ఉన్నారంటే చాలు ఆటోమేటిక్ గా సందడి వచ్చేస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో దగ్గర నుండి చిన్న హీరో సినిమా ఫంక్షన్ వరకు ప్రతి ఒక్కరు సుమనే యాంకర్ గా కోరుకుంటారు. ఆమె తీరిక లేకుండా ఆడియో ఫంక్షన్ లు, ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ మీట్లు, షోలతో బిజీ బిజీగా గడుపుతుంటారు.
Video Advertisement
సుమ మలయాళీ అయినా కూడా అచ్చం తెలుగు ఇంట పుట్టిన అమ్మాయిలా అనిపిస్తూ ఉంటారు. నిజంగా తెలుగువారు కూడా ఇంత స్వచ్ఛంగా స్పష్టంగా తెలుగు మాట్లాడలేరేమో. సుమ ప్రముఖు నటుడు రాజీవ్ కనకాల అని ప్రేమ వివాహం చేసుకున్నారు.
రాజీవ్ కనకాల క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగులో బిజీబిజీగా సినిమాలు చేస్తూ ఉంటారు. వీరి అన్యోన్య దాంపత్వానికి ఇద్దరు పిల్లలు జన్మించారు. సుమ కొడుకు రోషన్ కూడా హీరోగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. ఇటీవల అతను నటించిన బబుల్ గమ్ చిత్ర టీజర్ విడుదలై ప్రేక్షకులను అలరిస్తుంది.ఈ క్రమంలోని సుమ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన సమాజంలో మహిళలు భర్తలు చనిపోతే తమ కుటుంబ పోషణ కోసం రకరకాల పనులు చేసుకుంటూ ఉంటారని అన్నారు.
కనీసం వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్, డబ్బులు దాచుకోవడం, ఇన్సూరెన్స్ లాంటి సంగతులు ఏమి తెలియవని అన్నారు. కనీసం భర్తకి ఇన్సూరెన్స్ ఉంటే అతను చనిపోయాక ఎంతో కొంత డబ్బు వచ్చేదని ఇవేమీ వాళ్లకి తెలియవని, మన చుట్టూ ఉండే వారికి ఇవన్నీ తెలియజేయడం మన బాధ్యత అని అన్నారు.ఈ నేపథ్యంలో తనకు ఉన్నఇన్సూరెన్స్ గురించి ఒక రోజు తన పిల్లలకి కూర్చోబెట్టి చెప్పానని అన్నారు.
ఒకవేళ తాను హఠాత్తుగా చనిపోతే ఎవరికి ఎంత డబ్బు వస్తుంది, ఏ ఇన్సూరెన్స్ నుంచి వస్తుందని వివరంగా తెలియజేశారని అన్నారు. కానీ ఎందుకు మమ్మీ నువ్వు ఇలా మాట్లాడతావు అంటూ పిల్లలు అడిగారని, ఏది ఏమైనా పిల్లలకు రియాల్టీ గురించి తెలియజేయాలని తెలిపారు. ఈ క్షణం పక్కన పెడితే రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు, ఇలాంటి విషయాలు ధైర్యంగా పిల్లలకు షేర్ చేయాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. ఇప్పుడు సుమా వ్యాఖ్యలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. సుమా చేసిన వ్యాఖ్యలు నిజమేనని పలువురు మద్దతు తెలుపుతున్నారు.
Also Read:చేతులు అక్కడ పెట్టి ఆ స్టెప్ ఏంటి అంటూ…”తమన్నా” పై ఫైర్ అయిన “లియో” నటుడు.! అసలేమైంది.?
End of Article