Ads
తెలుగు టెలివిజన్ పరిశ్రమ, యాంకరింగ్. ఈ రెండు పదాలు విన్న వెంటనే గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు సుమ. మలయాళీ అయినా కూడా ఇక్కడే స్థిరపడి, తెలుగు బాగా నేర్చుకొని తెలుగు అమ్మాయి అయ్యారు. సుమ కెరీర్ మొదలు పెట్టి దాదాపు 20 సంవత్సరాలు అయ్యింది.
Video Advertisement
ఈ 20 సంవత్సరాల్లో సుమ ఎన్నో టీవీ షోలు, ప్రీ రిలీజ్ రిలీజ్ ఈవెంట్స్, ఎన్నో అవార్డు ఫంక్షన్స్, ఇంకా ఎన్నో ఇంటర్వ్యూలు చేశారు.
తన ఎదుట ఎంత పెద్దవారు ఉన్నా, ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన వారు ఉన్నా కూడా ఎవరిని నొప్పించకుండా, ఇబ్బంది పెట్టకుండా, ఒక పక్క సరదాగా మాట్లాడుతూనే, మరొక పక్క మర్యాద ఇస్తూ సుమ అందరితో మాట్లాడతారు. అసలు సుమ ఎక్కడ ఉంటే అక్కడ ఒక రకమైన సందడి వచ్చేస్తుంది. ఇలా ఎంత పెద్ద షో అయినా సరే సింగిల్ హ్యాండ్ గా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం అనేది కేవలం సుమకి మాత్రమే సాధ్యం ఏమో.
అయితే అంత జాగ్రత్తగా మాట్లాడే సుమ ఇటీవల మాట్లాడిన కొన్ని మాటలు వివాదాస్పదం అయ్యాయి. వైష్ణవ్ తేజ్, శ్రీలీల నటించిన ఆదికేశవ సినిమాలోని ఒక పాట లిరికల్ వీడియో రిలీజ్ ఈవెంట్ లో సుమ యాంకరింగ్ చేశారు. మీడియా వారిని ఉద్దేశించి సుమా మాట్లాడుతూ, “స్నాక్స్ ని భోజనం లాగా తింటున్నారు. త్వరగా వచ్చి కెమెరాలు ఏర్పాటు చేయండి” అని అర్థం వచ్చేలాగా సుమా మాట్లాడారు. తర్వాత మీడియాకు సంబంధించిన ఒక విలేఖరి ఈ విషయంపై మాట్లాడుతూ, “ఈ మాట అనకుండా ఉండాల్సింది” అని సుమని అన్నారు.
సుమ మళ్లీ వాతావరణాన్ని మామూలు చేయడానికి, “స్నాక్స్ ని స్నాక్స్ లాగానే తిన్నారు” అని అన్నారు. అందుకు ఆ విలేఖరి మాట్లాడుతూ, “ఇలాగే అనకుండా ఉండాల్సింది” అని మళ్ళీ అన్నారు. దాంతో సుమ తన ఉద్దేశం అది కాదు అని, ఇలా అనడం వల్ల బాధ కలిగినట్టు అయితే సారీ అని చెప్పారు. దీనిపై సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ వస్తున్నాయి. కొంత మంది, “సుమ అన్న ఉద్దేశం అది కాదు” అని అంటూ ఉంటే, మరి కొంత మంది మాత్రం, “ఇలా అనకుండా ఉండాల్సింది” అని అంటున్నారు.
watch video :
ఈవెంట్ లో సుమ సారీ చెప్పినా కూడా మళ్లీ తర్వాత ఒక వీడియో చేసి, తాను ఈవెంట్ లో చేసిన కొన్ని వ్యాఖ్యలు మీడియా మిత్రులను బాధించాయి అని తనకి తెలిసింది అని, ఎన్నో సంవత్సరాల నుండి వారితో పాటు కలిసి ట్రావెల్ అవుతున్నారు అని, తమ ఇంట్లో అమ్మాయి అనుకోని క్షమించండి అని సుమ చెప్పారు. అయితే తన 20 ఏళ్ల కెరీర్ లో ఇలా అవ్వడం ఇదే మొదటి సారి. దాంతో సుమ ఈ విషయం మీద స్పందించి క్షమాపణలు చెప్పారు.
watch video :
ALSO READ : మరోసారి మంచి మనసు చాటుకున్న చిరంజీవి…. ఏం చేశారంటే…?
End of Article