రెమ్యూనరేషన్ పెంచేసిన మీనాక్షి చౌదరి… అన్ని కోట్ల?

రెమ్యూనరేషన్ పెంచేసిన మీనాక్షి చౌదరి… అన్ని కోట్ల?

by Mounika Singaluri

Ads

ఇచట వాహనాలు నిలపరాదు సినిమాతోటి తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. ఆ సినిమా అంతగా ఆడకపోయినా కూడా మీనాక్షి చౌదరి తన అభినయంతో అందరిని ఆకట్టుకుంది. తర్వాత అడివి సరసన హిట్ 2 సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. రవితేజ సరసన ఖిలాడి సినిమాలో నటించి మంచి గ్లామర్ ప్రదర్శన చేసిన కూడా ఆ సినిమా మంచి ఫలితం ఇవ్వలేదు.

Video Advertisement

ఈ అమ్మాయి కేవలం హీరోయిన్ కాదు ప్రొఫెషనల్ డాక్టర్ కూడా. బ్యాడ్మింటన్ ప్లేయర్ గా మోడల్ గా కూడా రాణించింది.అయితే తాజాగా మీనాక్షి చౌదరికి టాలీవుడ్ లో వరుస పెట్టి ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమా నుండి పూజా హెగ్డే తప్పుకోవడంతో ఈ అవకాశం మీనాక్షి చౌదరిని వరించింది.

ఈ సినిమాలే కాకుండా సితార ఎంటర్టైన్మెంట్స్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న లక్కీ భాస్కర్ చిత్రంలో కూడా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.అయితే అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోవడంతో రెమ్యూనిరేషన్ కూడా భారీగా పెంచేసింది. ఈ ముద్దుగుమ్మకు తమిళంలో కూడా మంచి ఆఫర్ వచ్చింది. దళపతి విజయ్ హీరోగా ప్రముఖ దర్శకుడు వెంకట ప్రభువు డైరెక్షన్లో వస్తున్న సినిమాలో మీనాక్షి చౌదరిని హీరోయిన్ తీసుకున్నారు.

ఏకంగా ఈ సినిమాకి మూడు కోట్లు రూపాయలు అడిగినట్లుగా సమాచారం. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ రెమ్యూనిరేషన్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను ఈ హీరోయిన్ బాగా పాటిస్తుందని సిని వర్గాలు చెప్పుకుంటున్నాయి.మహేష్ బాబు గుంటూరు కారం సినిమా హిట్ అయితే తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

 

Also Read:పార్ట్ 1 చాలా పెద్ద హిట్… ఇప్పుడు పార్ట్ 2 కోసం వెయిటింగ్..! అసలు ఏం ఉంది ఇందులో..?


End of Article

You may also like