Ads
ప్రస్తుత రోజుల్లో దాంపత్య జీవితాలు అన్యోన్యంగా సాగాలంటే దంపతులు మధ్య ఎటువంటి దాపరికాలు ఉండకూడదు. ఇద్దరి మధ్య అభిప్రాయాలు కుదరకుండా పెళ్లయిన సంవత్సరం తిరక్కుండానే ఎంతోమంది విడాకులు బాట పడుతున్నారు.
Video Advertisement
ఇటువంటి ఇబ్బందులు తమ దంపత్య జీవితంలో రాకూడదు అనుకుంటే ప్రతి మహిళ తన భర్తని అడగాల్సిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను తెలియజేస్తున్నారు. ఇద్దరు మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటే వారి సంసారం చాలా సాఫీగా సాగుతుందని సూచిస్తున్నారు. వాటిలో అతి ముఖ్యమైన వాటిని ఈ విధంగా తెలియజేశారు.
భవిష్యత్తు లక్ష్యాలు గురించి:
అబ్బాయిల జీవిత లక్ష్యాలు గురించి అడిగేందుకు చాలామంది అమ్మాయిలు వెనకాడతారు
అలా అడిగితే ఒత్తిడికి గురవుతారని,కోపగిస్తారని భయపడుతుంటారు. నిజానికి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే వారి కంటే తప్పించుకునే అబ్బాయిలే ఎక్కువ. అబ్బాయి జీవిత లక్ష్యాలు, దీర్ఘకాలిక లక్ష్యాలు ఏంటో ముందుగానే తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. దీనివల్ల ఇద్దరికీ ఒక స్పష్టత ఉంటుంది.
రిలేషన్షిప్ గురించి అభిప్రాయం:
మన అనుబంధం గురించి ఏమనుకుంటున్నావు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనివల్ల వివాదం ఏర్పడుతుందా? మనస్పర్ధలు వస్తాయని ఆలోచించవద్దు. ఎందుకంటే ఇద్దరి మధ్య దాపరికాలు లేని స్వచ్ఛమైన ఆలోచనలే బంధానికి బలమైన పునాదులు. ఆరోగ్యకరమైన ఆనందకరమైన అనుబంధానికి ఈ మాత్రం స్పష్టత అవసరం.
నా నుంచి ఏమి కోరుకుంటున్నావు:
భావోద్వేగంగా వాస్తవికంగా నా నుంచి ఏమి కోరుకుంటున్నావు అని అడగడం కూడా చాలా అవసరం. దీనివల్ల ఒకరి మనసు ఏమి కోరుకుంటుంది అనేది మరొకరికి ముందే తెలుస్తుంది.
ఇద్దరూ ఒకరికి ఒకరు తోడుగా ఉండడానికి ఇవి పునాదులు వేస్తాయి.
కష్టాలను ఎలా ఎదుర్కొంటావు:
జీవితంలో ఎప్పుడైనా కష్టాలు, సవాళ్లు ఎదురైనప్పుడు ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటావని ముందే అడగడం కొంచెం కష్టమైన ప్రశ్న. కాకపోతే ఇలా అడగడం వల్ల కష్ట సమయాలను ఎలా గట్టెక్కవచ్చు అనే దానిపైన ఒక స్పష్టత ఉంటుంది. ఒకరికి తోడుగా మరొకరు ఉండేందుకు దారి చూపిస్తుంది.
డబ్బు గురించి అవగాహన:
దంపతులు మధ్య డబ్బు విషయం చాలా సున్నితమైనది. డబ్బు ప్రస్తావన తెస్తే గొడవలు వస్తాయన్న భయం ఉండొచ్చు కానీ, కలిసి నడిచే వారి మధ్య ఆర్థికపరమైన విషయాలు కూడా చాలా పారదర్శకంగా ఉండాలి. ఇద్దరూ కలిసి జీవితానికి సంబంధించిన ప్రణాళికను రూపొందించుకోవడం ద్వారా ఆర్థిక స్వేచ్ఛను సొంతం చేసుకోవడానికి వీలుంటుంది.
ఇంటి పనుల్లో పాత్ర ఏమిటి:
ఇంటి పనుల్లో నీ పాత్ర ఎంతవరకు ఉంటుంది? ఏ విషయంలో నాకు సహాయం గా ఉంటావు అని మహిళ అడగడంలో తప్పులేదు. ఎందుకంటే బాధ్యతలని ఒకరి నెత్తి మీద వేయడం కంటే ఇద్దరు సమానంగా పంచుకున్నప్పుడే అది సవ్యంగా సాగుతుంది.
Also Read:తన భార్యతో దిగిన ఫోటో పోస్ట్ చేసి..ఇదే చివరి సెల్ఫీ అన్నాడు! అసలేమైందో తెలిస్తే కన్నీళ్లే!
End of Article