ఇంత మంచి సినిమాని ఎవరు పట్టించుకోలేదా..? ఈ సినిమా చూశారా..?

ఇంత మంచి సినిమాని ఎవరు పట్టించుకోలేదా..? ఈ సినిమా చూశారా..?

by Mounika Singaluri

Ads

తమిళ సూపర్ స్టార్ శింబు, గౌతమ్ కార్తీక్ హీరోలుగా నటించిన తమిళ మూవీ పత్తు తలా. అమెజాన్ ప్రైమ్ లో ఇటీవల రిలీజ్ అయింది. గ్యాంగ్ స్టార్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీకి కృష్ణ దర్శకత్వం వహించారు.ప్రియ భవాని శంకర్ ఇందులో హీరోయిన్ గా నటించింది. కోలీవుడ్ లో ఈ మూవీ కమర్షియల్ హిట్ గా నిలిచింది.

Video Advertisement

ఇక కథ విషయానికి వస్తే సంక్షేమమే క్షేమం పేరుతో ఇంటింటికి టీకాలు వేసే కొత్త పథకాన్ని ముఖ్యమంత్రి ప్రవేశపెడతాడు. ఈ పథకానికి సీఎం ప్రారంభించడం డిప్యూటీ సీఎం గుణశేఖర్ (గౌతమ్ మీనన్) కు ఇష్టం ఉండదు. అదేరోజు అనూహ్యంగా సీఎం కనిపించకుండా పోతాడు. ముఖ్యమంత్రి అదృశ్యం వెనక గ్యాంగ్ స్టార్ ఏజిఆర్ అలియాస్ ఏజీ రావణన్ (శింబు)ఉన్నాడని పోలీసులతో పాటు సిబిఐ అనుమానిస్తుంది.

కానీ అతనికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించదు. ఏజిఆర్ ని పట్టుకోవడానికి ప్రయత్నించిన చాలామంది పోలీసులు ప్రభుత్వ అధికారులు అదృశ్యం అవుతుంటారు. ఏజిఆర్ చేసే ఆకృత్యాలను బయటపెట్టే బాధ్యత అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గుణ అలియాస్ శక్తి (గౌతమ్ కార్తిక్ )చేపడతాడు కేజీఆర్ గ్యాంగ్ లో సభ్యుడిగా చేరి కొద్దిరోజుల్లోనే అతనికి నమ్మకస్తుడిగా మారిపోతాడు.ప్రపంచం దృష్టిలో కరుడుగట్టిన గ్యాంగ్ స్టార్ గా చలామణి అవుతున్న ఏజిఆర్ అసలు స్వరూపం ఏంటి?అతడు గ్యాంగ్ స్టార్ గా ఎందుకు మారాడు? సీఎం అదృశ్యం వెనక ఏజిఆర్ హస్తం ఉందా? సీఎం కి ఏజిఆర్ తో ఉన్న సంబంధం ఏమిటి?


ఏజిఆర్ తో అతని చెల్లెలు ఎందుకు మాట్లాడదు? గుణ పోలీస్ అనే విషయం ఎసిఆర్ కనిపెట్టాడా? పట్టుకోవడానికి వచ్చిన గుణ చివరికి అతని గ్యాంగ్ లోనే చేరాలని ఎందుకు నిర్ణయించుకున్నాడు? అనేది మిగిలిన కథ.గ్యాంగ్ స్టార్ డ్రామాకు ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ అంశాలను మేళావిస్తూ దర్శకుడు కృష్ణ ఈ సినిమాను తరికెక్కించాడు. ప్రజలకు మంచి చేయడానికి చెడు మార్గాన్ని ఓ గ్యాంగ్ స్టార్ ఎందుకు ఎంచుకోవలసి వచ్చింది? చట్టం దృష్టిలో పెద్ద క్రిమినల్ గా చలామణి అవుతున్న అతడిని ఓ అండర్ కవర్ పోలీస్ ఆధారంతో పట్టుకోడానికి ఏం చేశాడు? అనే అంశాల చుట్టూ ఈ కథను అల్లుకున్నాడు. అంతర్లీనంగా అన్న చెల్లెలు అనుబంధానికి కథలో చోటిచ్చాడు.

ముఖ్యమంత్రి కిడ్నాప్ ఐఎస్సీతోనే ఈ సినిమా ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది ఈ క్రైమ్ వెనకాల ఏజిఆర్ ఉన్నాడని పోలీసులు అనుమానించడం అతనికి గ్యాంగ్ లోకి రౌడీగా ప్రజలను నమ్మిస్తున్న అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గుణా చేరే అంశాలతో ఆరంభంలోనే ఈ మూవీ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. మరోవైపు ప్రభుత్వ అధికారితో గుణ ప్రేమ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తో ఫస్ట్ ఆఫ్ నిదానంగా నడిపించాడు.విరామ సన్నివేశాల్లో ఏజిఆర్ ఎంట్రీ ఇచ్చే సీను మళ్ళీ రైట్ ట్రాక్ లోకి కథ టర్న్ అయినట్లు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో ఏజిఆర్ విలనజాన్ని చూపిస్తూనే మరోవైపు అతన్ని పట్టుకోవడానికి గుణా సాగించే సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు థ్రిల్లింగ్ పంచుతాయి.

సీఎం భార్య ఏజిఆర్ ఇంట్లో కనిపించడం, నమ్మకస్తులే అతనికి ద్రోహం చేయడానికి ప్రయత్నించే మలుపులు ఆకట్టుకుంటాయి. చివరకు ఏజిఆర్ ను పట్టుకోవడానికి వచ్చిన గుణ అతని కోసం ప్రాణ త్యాగానికి సైతం సిద్ధమవడం బాగుంది. క్లైమాక్స్ ఎపిసోడ్ లోని యాక్షన్ సీన్స్ మాస్ ఫాన్స్ కు ఫుల్ ఫీస్టుగా అనిపిస్తాయి.గ్యాంగ్ స్టార్ పాత్రలో శింబు యాక్టింగ్ లుక్ చాలా బాగున్నాయి. క్యారెక్టర్ లో వేరియేషన్స్ బాగా చూపించాడు. ఇక గుణ అని అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో గౌతమ్ కార్తీక్ ఒదిగిపోయాడు. ప్రియ భవాని శంకర్ క్యారెక్టర్ కు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. గౌతమ్ మీనన్ పాత్ర రొటీన్ గా ఉంది.కన్నడ చిత్రం మఫ్టీకి రీమేక్ గా ఈ సినిమా రూపొందింది. శింబు యాక్టింగ్ కోసం ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు.

Also Read:“ఇంత పెద్ద పొరపాటు ఎలా చేశారు..? చూసుకోవాలి కదా..?”


End of Article

You may also like