Ads
డాన్స్ కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలు పెట్టి, తర్వాత దర్శకుడిగా మారి, దాంతో పాటు హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన నటుడు రాఘవ లారెన్స్. అటు దర్శకుడిగా, ఇటు నటుడిగా తనని తాను నిరూపించుకున్న నటుడు ఎస్ జె సూర్య. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా జిగర్తాండ డబుల్ x. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : జిగర్తాండ డబుల్ x
- నటీనటులు : రాఘవ లారెన్స్, SJ సూర్య, నిమిష సజయన్.
- నిర్మాత : కార్తికేయన్ సంతానం, కతిరేసన్
- దర్శకత్వం : కార్తీక్ సుబ్బరాజ్
- సంగీతం : సంతోష్ నారాయణన్
- విడుదల తేదీ : నవంబర్ 10, 2023
స్టోరీ :
సినిమా అంతా 1975 సమయంలో సాగుతుంది. పాండియన్ (రాఘవ లారెన్స్) ఒక రౌడీ. అలాగే అమెరికన్ యాక్టర్ అయిన క్లింట్ ఈస్ట్వుడ్ కి చాలా పెద్ద అభిమాని. అప్పుడు హీరోలు అందరూ కూడా తెల్లగా ఉండేవారు. దాంతో నల్లగా ఉన్న మొదటి హీరో తానే అవ్వాలి అని పాండియన్ అనుకుంటూ ఉంటాడు. ఇందుకు రే దాసన్ (ఎస్ జె సూర్య) ని సినిమా తీయడానికి పాండియన్ మాట్లాడుకుంటాడు. రే దాసన్ ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రే కి అసిస్టెంట్ దర్శకుడిగా పని చేసి వస్తాడు.
తెలుగులో ఒక మంచి క్లింట్ ఈస్ట్వుడ్ స్టైల్ సినిమా తీయాలి అని పాండియన్ అనుకుంటాడు. దాంతో రే దాసన్ తో కలిసి పాండ్య అనే సినిమా మొదలు పెడతారు. మరొక పక్క పాండియన్ ఒక పెద్ద గ్యాంగ్ స్టర్ అవ్వడంతో తన దందాలు, సెటిల్మెంట్లు కూడా చూస్తూ ఉంటాడు. ఈ రకంగా పాండియన్ కి కొంత మంది శత్రువులు కూడా ఉంటారు. ఇవన్నీ అధిగమించి పాండియన్ సినిమా తీశాడా? మొదటి నల్ల తెలుగు హీరో అయ్యాడా? వీళ్ళ సినిమా రిలీజ్ అయ్యిందా? పాండియన్ వల్ల రే దాసన్ ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
దాదాపు 9 సంవత్సరాల క్రితం అసలు ఎటువంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా జిగర్తాండ. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాబీ సింహ ఒక రౌడీ పాత్రలో నటించారు. సినిమా తీయాలి అని తపించే డైరెక్టర్ గా సిద్ధార్థ్ నటించారు. బాబీ సింహా నటనకి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అలాగే ఈ సినిమాకి అయితే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. చాలా డిఫరెంట్ గా ఉండడంతో ఎన్నో అవార్డులు కూడా అందుకుంది.
ఇదే సినిమాని తెలుగులో గద్దల కొండ గణేష్ పేరుతో రీమేక్ కూడా చేశారు. వరుణ్ తేజ్ ఇందులో బాబీ సింహ పోషించిన పాత్రను పోషించారు. ఇప్పుడు తమిళ్ సినిమా అయిన జిగర్తాండ సినిమాకి సీక్వెల్ విడుదల చేశారు. సినిమా స్టోరీ లైన్ దాదాపు ఒకటే లాగా ఉంటుంది. ఒక రౌడీ, ఒక డైరెక్టర్. ఇలా వీళ్ళ మధ్యలోనే సినిమా సాగుతుంది. కానీ దీనికి కార్తీక్ సుబ్బరాజ్ కాస్త డిఫరెంట్ టచ్ ఇచ్చారు. 1975 అంటే నలుపు రంగులో ఉన్న వాళ్ళు నటులు అవ్వలేరు అని ఒక అపోహ ఉన్న రోజులు.
దాంతో చాలా మంది నటులు అవమానాలు కూడా ఎదుర్కొన్నారు. నటన బాగా నేర్చుకొని, అవకాశాల కోసం ప్రయత్నిస్తూ, రంగు కారణంగా అవమానాలు ఎదుర్కొన్న సమయంలో, కేవలం సినిమాలు మాత్రమే చూసి, నటించాలి అనే పిచ్చి పెంచుకొని, అంతే కాకుండా ఈ అవమానాలన్నింటినీ ఆపేయాలి అని మొదటి నల్ల హీరో కావాలి అని హీరో ధైర్యం చేయడం, ఇదంతా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అంతే కాకుండా అలాంటి ఒక సెన్సిటివ్ విషయం మీద కామెడీ, యాక్షన్ కూడా యాడ్ చేసి ఈ సినిమా రూపొందించారు.
అంతే కాకుండా ఎస్ జె సూర్య పాత్రతో ఒక దర్శకుడి కోణం ఎలా ఉంటుంది అనేది కూడా ఈ సినిమాలో చూపించారు. మరొక పక్క హీరో వృత్తి అయిన రౌడీయిజాన్ని కూడా ఈ సినిమా మేకింగ్ లో భాగం చేయడం అనేది సినిమా ముందుకు వెళ్లడానికి ఒక దారి క్రియేట్ చేస్తుంది. దాంతో సినిమా అంతా కూడా ఒక పక్క ఎంటర్టైన్ చేస్తూనే, మరొక పక్క యాక్షన్ కూడా ఉంటుంది. ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సినిమాలో ఉన్న నటీనటులు అందరూ కూడా తమని తాము ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న నటులు. కాబట్టి వారి పాత్రలు వారు బాగా చేశారు.
పాండియన్ పాత్రలో రాఘవ లారెన్స్ ఒక డిఫరెంట్ స్టైల్ తో, రెట్రో లుక్ తో చాలా బాగా చేశారు. రే దాసన్ పాత్రలో ఎస్ జె సూర్య కూడా అంతే బాగా చేశారు. తెలుగులో కూడా తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకోవడం అనేది ఒక ప్లస్ అయ్యింది. హీరోయిన్ పాత్రలో నటించిన నిమిష, విలన్ పాత్రలో నటించిన షైన్ టామ్ చాకో, అలాగే మన తెలుగు నటుడు నవీన్ చంద్ర వీరందరూ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాకి అతి పెద్ద హైలైట్ మాత్రం సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం. పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ చాలా బాగున్నాయి.
అంతే కాకుండా తిరు అందించిన సినిమాటోగ్రఫీ కూడా సినిమాని ఇంకొక లెవెల్ కి తీసుకెళ్ళింది. ఒక తెలిసిన కథని ఎంత బాగా ప్రజెంట్ చేయొచ్చు అని చెప్పడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ. కథలో పెద్ద కొత్తదనం ఏదీ లేదు. ఇలాంటి కథ ఉన్న సినిమాలు చూశాం. కానీ మంచి నటీనటులు, మంచి టెక్నీషియన్స్, తనకంటూ ఒక డిఫరెంట్ స్టైల్ ఉన్న డైరెక్టర్ ఇలాంటి ఒక సాధారణ సబ్జెక్ట్ ని హ్యాండిల్ చేసినా కూడా ఒక మంచి సినిమా అవుతుంది అని ఈ సినిమా మరొకసారి నిరూపించింది.
కానీ ఎంత బాగున్నా కూడా సినిమాలో ఏదో ఒక లోపం ఉంటుంది. ఈ సినిమా చాలా నెమ్మదిగా నడుస్తుంది. అదే ఈ సినిమాకి ఒక డ్రా బ్యాక్ అయ్యింది. అంతే కాకుండా జిగర్తాండ విడుదల అయినప్పుడు పెద్దగా అంచనాలు ఏమీ లేవు కాబట్టి సినిమా కథ ప్రేక్షకులకు కొంచెం కొత్తగా అనిపించింది. కానీ దాదాపు అదే కథని మళ్లీ తీయడంతో ఇది ఆల్రెడీ చూశాం కదా అనే ఫీలింగ్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటులు
- సంగీతం
- సినిమాటోగ్రఫీ
- కొన్ని కామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్:
- చాలా స్లోగా సాగే స్క్రీన్ ప్లే
- రొటీన్ కథ
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
అసలు మొదటి పార్ట్ కి దీనికి సంబంధం లేదు. దానితో పోల్చి చూస్తే ఈ సినిమా కాస్త నిరాశ పరుస్తుంది. కానీ ఈ సినిమాకి మొదటి పార్ట్ ఉంది అన్న విషయాన్ని మర్చిపోయి, రొటీన్ కథ అయినా పర్వాలేదు, సినిమా స్లోగా నడిచినా కూడా చూస్తాం అనుకునే వారికి, ఈ సినిమాకి పని చేసిన వారి పని తీరుని ఇష్టపడే వారికి జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమా ఒక్కసారి చూడగలిగే మంచి డార్క్ కామెడీ యాక్షన్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : ఒకే లాగ కనిపించే 9 మంది హీరోస్.! లిస్ట్ లో ఎవరెవరున్నారో చూడండి.!
End of Article