Ads
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శక్తి. ఈ మూవీ తొలి షోతోనే నెగెటివ్ టాక్ తెచ్చుకుని భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఫ్లాప్ అవడంతో ప్రొడ్యూసర్ కి భారీ నష్టాలను మిగిల్చింది.
Video Advertisement
ఈ చిత్రంలో ప్రభు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, హీరోయిన్ మంజరి ఫడ్నిస్, నాజర్, జాకీ ష్రాఫ్, వినోద్ కుమర్ వంటి వారు నటించారు. అయితే ఈ మూవీలో ఎన్టీఆర్ హీరోయిన్ కాపాడే సన్నివేశంలో మిస్టేక్ ని గమనించిన నెటిజెన్లు డైరెక్టర్ పై కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెహర్ రమేష్ కాంబినేషన్ లో వచ్చిన రెండవ మూవీ శక్తి. ఈ మూవీకి ముందు ఇదే కాంబోలో కంత్రి అనే సినిమా వచ్చింది. మెహర్ రమేష్ తెలుగులో దర్శకత్వం వహించిన మొదటి సినిమా కంత్రి. ఈ సినిమాని అశ్వినీదత్ నిర్మించారు. మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, బాగానే వసూల్ చేసింది. ఈ సినిమా తరువాత మూడేళ్లకి ఎన్టీఆర్ – మెహర్ రమేష్ కాంబోలో ‘శక్తి’ సినిమా రూపొందింది.
ఈ చిత్రానికి అశ్వినీదత్ నిర్మాత. ఈ మూవీ రిలీజ్ అయిన తొలి షోతోనే నెగెటివ్ టాక్ తెచ్చుకుని పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా వల్ల వచ్చిన నష్టానికి అశ్వినీదత్ నిర్మాణ రంగం విడిచి, విజయవాడకు వెళ్ళిపోవాలని అనుకున్నానని ఒక సందర్భంలో వెల్లడించారు. ఈ మూవీలో ఎన్టీఆర్ తండ్రికొడుకులుగా నటించారు. ఎన్టీఆర్ సీక్రెట్ ఆపరేషన్ లో హోమ్ మినిస్టర్ కుమార్తె ను కాపాడే గైడ్ పాత్రలో కనిపిస్తాడు.
ఒక సీన్ లో హీరోయిన్ ఇలియానాను కొందరు బలవంతంగా తీసుకెళ్తుంటారు. ఆ విషయాన్ని ఆమె ఫ్రెండ్స్ ఎన్టీఆర్ తో చెప్పడంతో ఆమెని కాపాడడం కోసం ఎన్టీఆర్ పారాషూట్ సహాయంతో వెళ్ళి విలన్ పై దుకుతాడు. కానీ ఆ సీన్ లో డూప్ పెట్టడంతో, ఎన్టీఆర్ కి బదులు సీన్ లో డూప్ కనిపిస్తాడు. ఈ మిస్టేక్ ని గమనించిన నెటిజెన్లు చూసుకోవాలి కదా డైరెక్టర్ గారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: JAPAN REVIEW : “కార్తీ” కి ఈ సినిమాతో మరొక హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
End of Article