“ఈ అభ్యర్థిని ఎందుకు తీసుకుంటున్నారు..?” అంటూ… “జనసేన పార్టీ” పై కామెంట్స్..!

“ఈ అభ్యర్థిని ఎందుకు తీసుకుంటున్నారు..?” అంటూ… “జనసేన పార్టీ” పై కామెంట్స్..!

by Harika

Ads

తెలంగాణ శాసనసభ ఎలెక్షన్స్ లో భాగంగా అన్ని BRS , కాంగ్రెస్, భాజపా పార్టీల మధ్య పసి పాప లాంటి జనసేన పార్టీ నిలదొక్కుకోవడం ఒక సావాసం. అలాంటి నడుమ పార్టీ అభ్యర్థి ఎవరన్నా సరే అన్నటుగా ఉంది పరిస్థితి.

Video Advertisement

కానీ సూర్యాపేట జిల్లాలోని కోదాడ నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు మరియు నేతల నడుమ తీవ్ర ఆందోళన నెలకొంది.మేకల సతీష్ రెడ్డి మాకు వద్దు అని కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు.

 

తెలంగాణ జనసేన కార్యకర్తలు మీడియా తో మాట్లాడుతూ,”సతీష్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి నామినేషన్ వేసేముందు ప్రెస్ మీట్ పెట్టారు.ఈ విషయం కానీ ఆయన నామినేషన్ వేసేవరకు ఎవరికీ సమాచారం లేదు.పార్టీ కార్యాలయం పెట్టడం కానీ పార్టీ సమావేశం కానీ ఎటువంటిది లేదు.పార్టీని ఎలా గెలుపుదామనుకుంటున్నారు?”అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర సహాయమంత్రి అయినా రాజీవ్ చంద్రశేఖర్ ఈరోజు కోదాడలో పర్యటించేందుకు వచ్చినప్పుడు జనసేన కార్యకర్తలు ఆయనను అడ్డుకొని నియోజకవర్గంతో సంబందమే లేని ఎన్‌ఆర్ఐ సతీష్ రెడ్డికి టికెట్‌ ఎలా ఇచ్చారని నిలదీశారు. వారికి ఆయన నచ్చజెప్పి శాంతింపజేసేందుకు ప్రయత్నించారు కానీ శాంతించకపోవడంతో ఆయన కారెక్కి వెళ్ళిపోయారు.

ఇక కోదాడలోని ప్రత్యర్ధుల బలాబలాలను ఓ మారు పరిశీలిస్తే, సీనియర్ కాంగ్రెస్‌ నేత, మాజీ పిసిసి అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి కుటుంబానికి కోదాడ నియోజకవర్గంపై మంచి పట్టుంది. ఈసారి ఆయన భార్య పద్మావతి కోదాడ నుంచే పోటీ చేస్తున్నారు. ఆమె కోదాడలో రాజకీయంగా చాలా యాక్టివ్‌గా ఉంటారు. గత ఎన్నికలలో స్వల్ప తేడాతో ఆమెను ఓడించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే బి. మల్లయ్య యాదవ్ కూడా ఈ 5 ఏళ్ళలో నియోజకవర్గంపై పట్టు సాదించారు.వీరు కాక మరి కొందరు స్వతంత్ర అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు.

పైగా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్‌ గాలి వీస్తోంది. కనుక ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలిచి అధికారం నిలుపుకోవాలని బిఆర్ఎస్ పార్టీ మరింత పట్టుదలగా పనిచేస్తోంది. ఇప్పుడు పార్టీ అభ్యర్ధిని స్థానిక కార్యకర్తలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఇప్పుడే అందిన తాజా సమాచారం ఏమిటంటే, తెలంగాణలో జనసేనకు ప్రాంతీయపార్టీగా గుర్తింపు లేనందున కేంద్ర ఎన్నికల కమీషన్‌ జనసేనకు దాని ఎన్నికల చిహ్నామైన గ్లాసుని గుర్తుగా ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో జనసేన తరపున 8 మంది వేర్వేరు గుర్తులతో స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేయవలసి ఉంటుంది. ఈ పరిస్థితులలో జనసేనకు విజయావకాశం ఎంత?సమాధానం అందరికీ తెలుసు.

watch video :


End of Article

You may also like