జిగర్తాండ డబల్ x 4 రోజులలో ఎంత కలెక్ట్ చేసిందంటే…..

జిగర్తాండ డబల్ x 4 రోజులలో ఎంత కలెక్ట్ చేసిందంటే…..

by kavitha

Ads

కోలీవుడ్లో ఆల్ రౌండర్లుగా పేరొందిన రాఘ‌వ లారెన్స్‌, ఎస్‌జే సూర్య..లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కిన చిత్రం ‘జిగ‌ర్ తండ డ‌బుల్ ఎక్స్‌’. కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వహించారు.

Video Advertisement

జిగర్తాండ డబల్ x చిత్రాన్ని ‘స్టోన్ బెంచ్ ఫిలింస్’ బ్యాన‌ర్‌ పై కార్తికేయన్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్‌కు రెస్పాన్స్ బాగానే వచ్చింది. ముఖ్యంగా టీజర్ కి సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ గా నిలిచింది. దీంతో సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడింది.

ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దీపావళి కానుకగా నవంబర్ 10న విడుదల అయ్యింది.మొదటి రోజు టాక్ బాగానే వచ్చింది. కానీ ఓపెనింగ్స్ మాత్రం అంతంత మాత్రంగానే నమోదయ్యాయి.కానీ రెండో రోజు నుండి కొంత పర్వాలేదు అనిపించింది. ‘జిగర్ తండ డబుల్ ఎక్స్ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.6 కోట్లు షేర్ ను రాబట్టాలి. బ్రేక్ ఈవెన్ కి ఈ చిత్రం రూ.6.3 కోట్ల షేర్ ను రాబట్టాలి. టాక్ పర్వాలేదు అనిపించినప్పటికీ.. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం రూ.1.71 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.కొంత గ్రోత్ అయితే ఈ సినిమా చూపించింది కానీ బ్రేక్ ఈవెన్ కి ఈ మాత్రం సరిపోదు అనే చెప్పాలి. బ్రేక్ ఈవెన్ కోసం ఈ మూవీ 4.59 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

మొత్తం తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ లో కలెక్షన్స్ చూసుకుంటే ఎక్కువగా నైజాం లో 0 .72 కోట్ల ఆదాయం రాగ ,సీడెడ్ మరియు కృష్ణా లో 0 .15 వ్యాపారం జరిగింది.ఈస్ట్ మరియు గుంటూరు లో 0.14 కొట్లావ్యాపారం జరిగింది.వెస్ట్ లో ౦.13 కోట్ల వ్యాపారం జరగ్గా నెల్లూరు అట్ట అడుగున 0.11 వ్యాపారం తో ముగించింది.దీపావళి పండుగ,రెండవ శనివారం మరియు ఆదివారం తో వరుసగా 3 రోజులు సెలవలు వచ్చిన కూడా అంత అంచనాలను అందుకోలేక పోయిందేమో అని అనిపిస్తుంది కలెక్షన్ల విషయంలో.


End of Article

You may also like