Ads
ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ ఎంట్రీ ఇచ్చి, తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్న హీరో పంజా వైష్ణవ్ తేజ్. మరొక పక్క పెద్ద హీరోలు, యంగ్ హీరోలు అందరితో సినిమాలో చేస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ శ్రీలీల. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఆదికేశవ. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : ఆదికేశవ
- నటీనటులు : పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల, రాధిక శరత్ కుమార్, జోజు జార్జ్, సదా, సుదర్శన్.
- నిర్మాత : సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
- దర్శకత్వం : శ్రీకాంత్ ఎన్ రెడ్డి
- సంగీతం : జీవి ప్రకాష్ కుమార్
- విడుదల తేదీ : నవంబర్ 24, 2023
స్టోరీ :
బాలు (వైష్ణవ్ తేజ్) ఒక కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఆ కంపెనీ సీఈఓ చిత్ర (శ్రీలీల). బాలు అక్కడ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి, జాబ్ కొడతాడు. బాలు వ్యక్తిత్వం నచ్చడంతో చిత్ర బాలుతో ప్రేమలో పడుతుంది. చిత్ర తండ్రి వారి పెళ్లికి ఒప్పుకుంటాడు. ఒకరోజు బాలుకి తన తండ్రి మహాకాళేశ్వర రెడ్డి (సుమన్) యాక్సిడెంట్ కి గురయ్యాడు అనే వార్త వస్తుంది.
అప్పుడు బాలుకి తన తల్లి కూడా ఎప్పుడో చనిపోయింది అని, తనని పెంచిన వారు తన సొంత తల్లిదండ్రులు కాదు అని తెలుస్తుంది. రాయలసీమలో ఉన్న చెంగారెడ్డి (జోజు జార్జ్) వల్ల బాలు సోదరి (అపర్ణ దాస్) ఇబ్బందుల్లో ఉంది అని బాలు తెలుసుకుంటాడు. అసలు ఈ చెంగారెడ్డి ఎవరు? ఇతనికి, బాలుకి ఉన్న సంబంధం ఏంటి? బాలు తల్లిదండ్రులు ఎవరు? బాలు తన తల్లిదండ్రుల నుండి ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
మొదటి సినిమాతోనే డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమా చేసి, ఆ తర్వాత కూడా కొండ పొలం వంటి మరొక డిఫరెంట్ సబ్జెక్ట్ ఉన్న సినిమా చేశారు పంజా వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత వచ్చిన రంగ రంగ వైభవంగా సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకొని ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. సినిమా ట్రైలర్ చూస్తే ఇది ఒక కమర్షియల్ సినిమా అని అర్థం అవుతోంది.
సినిమా మొత్తం కూడా అలాగే సాగుతుంది. ఒక కమర్షియల్ సినిమాలో ఎలాంటి అంశాలు అయితే ఉండాలో, ఈ సినిమాలో కూడా అవి అన్నీ ఉన్నాయి. చూసే ప్రేక్షకుడికి ఎక్కడా కూడా మనం ఒక కొత్త సినిమా చూస్తున్నాం అని అనిపించదు. అంత రొటీన్ గా ఉంది. కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. కానీ అవన్నీ కూడా సినిమాకి పెద్దగా సహాయం చేయలేకపోయాయి. కొన్ని ఫైట్ సీన్స్ అయితే మరీ లాజిక్ లేకుండా అనిపిస్తాయి. ఒక సమయంలో ఏదో బోయపాటి సినిమా చూస్తున్నాం ఏమో అనిపిస్తుంది.
ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, హీరో వైష్ణవ తేజ్ ముందు సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో ఒక డిఫరెంట్ పాత్ర చేసినా కూడా పాత్ర కోసం ఇంకా కొంచెం వర్క్ చేస్తే బాగుండేది ఏమో అనిపిస్తుంది. పెద్ద కొత్తగా ఏమీ అనిపించలేదు. బయటికి చాలా సాఫ్ట్ గా కనిపించే హీరో కోపం వస్తే ముందు వెనక ఏమీ ఆలోచించడు అని చెప్పడానికి ప్రయత్నించారు. ఫైట్ సీన్స్ కూడా హీరోలోని ఈ క్వాలిటీని చూపించేలా డిజైన్ చేశారు. హీరోయిన్ శ్రీ లీల ఉన్నారు అంటే, ఉన్నారు అంతే.
పాటల్లో చూడడానికి బాగా కనిపించారు. బాగా డాన్స్ చేశారు. నటన పరంగా పెద్ద చెప్పుకోదగ్గ పాత్ర ఏమి కాదు. సీనియర్ హీరోయిన్ రాధిక, మలయాళంలో చాలా పేరు తెచ్చుకున్న నటుడు జోజు జార్జ్, ఆయన భార్యగా నటించిన సదా, తెలుగులో మొదటి సారిగా నటించిన అపర్ణ దాస్ వీళ్ళందరికీ కూడా అంత మంచి పాత్రలు దొరకలేదు అని చెప్పాలి. వీళ్ళు చాలా మంచి నటులు. కాబట్టి వీళ్ల నుండి ఇంకా గొప్ప నటనని ప్రేక్షకులు ఆశిస్తారు.
అది ఈ సినిమాలో లేదు. జీవి ప్రకాష్ కుమార్ అందించిన పాటలు కూడా గుర్తు పెట్టుకునే అంత గొప్పగా లేవు. విజువల్స్ మాత్రం బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. కానీ రొటీన్ కమర్షియల్ సినిమా కావడంతో చూసినవారికి ఆసక్తికరంగా అనిపించదు. కమర్షియల్ సినిమా అయినా కూడా టేకింగ్ పరంగా ఇంకా జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- నిర్మాణ విలువలు
- విజువల్స్
మైనస్ పాయింట్స్:
- రొటీన్ స్టోరీ
- లాజిక్ లేని సీన్స్
- ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ డిజైన్ చేసిన విధానం
- కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్
రేటింగ్ :
2/5
ట్యాగ్ లైన్ :
ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, రొటీన్ స్టోరీ ఉన్నా కూడా పర్వాలేదు, అసలు వైష్ణవ్ తేజ్ ఇలాంటి పాత్ర ఎలా చేశారు అని చూద్దాం అనుకున్న వారికి, శ్రీలీల డాన్స్ కోసం సినిమా చూద్దాం అనుకున్న వారికి ఆదికేశవ సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : హాయ్ నాన్న సెన్సార్ టాక్..! సినిమా ఎలా ఉందంటే..?
End of Article