హాయ్ నాన్న సెన్సార్ టాక్..! సినిమా ఎలా ఉందంటే..?

హాయ్ నాన్న సెన్సార్ టాక్..! సినిమా ఎలా ఉందంటే..?

by Mounika Singaluri

Ads

న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా తెరకెక్కిన హాయ్ నాన్న మూవీ రిలీజ్ కు మరో రెండు వారాల టైం మాత్రమే ఉంది. గత సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమా కోసం నాని మరింత విభిన్నంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే తాజాగా సెన్సార్ సభ్యులు ఈ సినిమాను చూశారని తెలుస్తోంది. ఈ సినిమాను చూసి సెన్సార్ సభ్యులు ఎమోషనల్ అయ్యారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

Video Advertisement

తండ్రీ కూతుళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని సెన్సార్ సభ్యుల నుంచి సమాచారం అందుతోంది.విభిన్న సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసుకున్న నాని ఎప్పటికప్పుడు కొత్త కొత్త దర్శకులను తీసుకువస్తూ ఉంటారు.

minus point in hi nanna teaser

తాజాగా దసరా మూవీతో నాని ఇలాంటి సినిమాలు కూడా చేస్తాడా అని అనిపించుకున్నాడు. ఇప్పుడు దసరా మూవీ తర్వాత డిఫరెంట్ గా హాయ్ నాన్న అంటూ ఒక క్లాస్ సబ్జెక్టుతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. శౌర్యువ్ అనే నూతన దర్శకుని ఈ సినిమాతో పరిచయం చేయనున్నాడు. తాజాగా ఎక్కడ చూసినా ఎన్నికల హడావిడి ఉండడంతో దాన్ని నాని తన సినిమా ప్రమోషన్స్ కోసం వాడేసుకున్నాడు.

అయితే హాయ్ నాన్న మూవీ డిసెంబర్ 7 తారీఖున విడుదలకు సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది.ఈ సినిమా చూసి సెన్సార్ సభ్యులకి కన్నీళ్లు పెట్టుకున్నారంటే ఇక సాధారణ ఆడియనన్స్ ను ఖచ్చితంగా మెప్పిస్తుందని సినిమా టీం ధీమాగా ఉందట. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ భారీ స్థాయిలో జరిగిందట. నాని గత మూవీ దసరాకు మించి హాయ్ నాన్న మూవీ కలెక్షన్స్ సాధిస్తుందని నాని అభిమానులు అంచనా వేస్తున్నారు.

Also Read:“లక్ష్మీ పార్వతి వల్ల మంచి జరగలేదు..! మా ఫ్యామిలీలోకి ఒక శని వచ్చింది” అంటూ… “నందమూరి చైతన్య కృష్ణ” కామెంట్స్..!


End of Article

You may also like