Ads
సినిమా రంగంలో క్యాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణం. హీరోయిన్ లను,ఆర్టిస్టులను టెక్నీషియన్ లను క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఇబ్బందులు పెట్టిన సంఘటనలు బయటకు వస్తూ ఉంటాయి. కొంతమంది ధైర్యంగా ముందుకు వచ్చి ఫలానా వాళ్లు నన్ను ఇబ్బంది పెట్టారని చెబుతారు. కొంతమంది అయితే కెరీర్ కోసం అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు.
Video Advertisement
చాలామంది కాస్టింగ్ కౌచ్ జరిగినప్పుడు చెప్పరు గాని కొన్ని సంవత్సరాల తర్వాత తమకి ఎదురైన అనుభవాలను బయటపెడతారు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఎక్కువగా వచ్చిన హీరోలలో నందమూరి బాలకృష్ణ పేరు వినిపిస్తూ ఉంటుంది.
హీరోయిన్ రాధిక ఆప్టే కూడా తాను నటించిన సౌత్ సినిమాలో ఒక సీనియర్ హీరో తనతో మిస్ బిహేవ్ చేశాడు అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే రాధిక ఆప్టే నటించిన ఏకైక సీనియర్ హీరో బాలకృష్ణ మాత్రమే. అయితే ఈ ఘటన పైన అటు బాలకృష్ణ గాని ఇటు రాధిక ఆప్టే గాని వివరణ ఇవ్వలేదు.తాజాగా విచిత్ర అనే తమిళ్ నటి మరోసారి నందమూరి బాలకృష్ణ పైన కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. తాను 2000-2001 సమయంలో ఒక తెలుగు సినిమా చేశానని ఆ సమయంలో ఆ సినిమా హీరో తనని గదికి రమ్మని పిలిచాడని చెప్పింది.
అయితే ఆ హీరో పేరు మాత్రం చెప్పలేదు. ఆ సమయంలో విచిత్ర చేసిన ఏకైక తెలుగు సినిమా భలేవాడివి బాసు. ఆ సినిమాలో హీరో బాలకృష్ణ.అయితే ఇప్పుడు ఈ సంఘటనమైన మరో నందమూరి హీరో చైతన్య కృష్ణను మీడియా వారు అడగగా తాను చాలా తెలివిగా స్పందించారు. బాలకృష్ణ అలాంటివారు కాదని ,తమకి బాలయ్య గురించి బాగా తెలుసునని, బాలయ్యకి వరుస పెట్టి హిట్లు వస్తున్నందుకు ఓర్వలేక ఈ ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా చైతన్య కృష్ణ బ్రీత్ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయం గురించి చెప్పారు.
watch video :
Also Read:అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా మొదలు అయ్యేది అప్పుడేనా..?
End of Article