అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా మొదలు అయ్యేది అప్పుడేనా..?

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా మొదలు అయ్యేది అప్పుడేనా..?

by Mohana Priya

Ads

హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన డైరెక్టర్ హీరో కాంబినేషన్స్ లో ఒక కాంబినేషన్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. జులాయి సినిమాతో మొదలైన వీరి ప్రయాణం, తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, ఆ తర్వాత అలవైకుంఠపురంలో సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టేలా సాగింది.

Video Advertisement

ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మరొక సినిమా వస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాకి సంబంధించి మిగిలిన విషయాలు ఏమీ తెలియదు. ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అవ్వడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ జాతీయ అవార్డు అందుకోవడం మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో అభిమానులను కూడా సంపాదించుకున్నారు. దాంతో ఈ సినిమా కూడా పాన్-ఇండియన్ సినిమాగానే విడుదల అవుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటి పాన్-ఇండియన్ సినిమా కూడా ఇదే అవుతుంది. దాంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ పాన్ ఇండియన్ స్టైల్ లో తన సినిమాని ఎలా చూపించబోతున్నారు అని ఎదురు చూసే వాళ్లు కూడా ఉన్నారు.

అయితే పుష్ప 2 అయిన వెంటనే అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఈ సినిమా మీద చర్చలు మొదలు పెడతారు అని సమాచారం. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కూడా మరొక సినిమాలో నటిస్తారు. అయితే అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తారు అనే వార్తలు వచ్చాయి. మరి అది ఎంత వరకు నిజం అనేది తెలియదు. ప్రస్తుతం అయితే పుష్ప తర్వాత అల్లు అర్జున్ నటించబోయే 2 సినిమాల అధికారిక ప్రకటన అయ్యింది. వీటిలో మొదట త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా వస్తే, ఆ తర్వాత సందీప్ రెడ్డి దర్శకత్వంలో సినిమా వస్తుంది.

ALSO READ : నాని నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఇతనేనా..? 2022 లో సూపర్ హిట్ కొట్టాడు..!


End of Article

You may also like