నాని నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఇతనేనా..? 2022 లో సూపర్ హిట్ కొట్టాడు..!

నాని నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఇతనేనా..? 2022 లో సూపర్ హిట్ కొట్టాడు..!

by Mohana Priya

Ads

సినిమాకి సినిమాకి సంబంధం లేకుండా, డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటిగా గుర్తొచ్చే నటుడు నాని. తన సహజమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

Video Advertisement

ఇటీవల దసరా సినిమాతో హిట్ కొట్టిన నాని ఇప్పుడు హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. తండ్రి కూతుర్ల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ లో విడుదల అవుతోంది. నాని ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ పనిలో బిజీగా ఉన్నారు.

nani

అయితే ఇదంతా జరుగుతున్నప్పుడే నాని తన నెక్స్ట్ సినిమా వివేక్ ఆత్రేయతో అని ప్రకటించారు. ఈ సినిమా పేరు సరిపోదా శనివారం అని ప్రకటిస్తూ ఒక వీడియో కూడా విడుదల చేశారు. సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ పేర్లు, నటుల పేర్లు ఇప్పటికే ప్రకటించారు. సినిమా షూటింగ్ మొదలవుతుంది. సూపర్ హీరో నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది అని అర్థం అవుతోంది. అయితే ఈ సినిమా తర్వాత నాని చేయబోయే సినిమా గురించి కూడా చర్చలు మొదలు అయ్యాయి.

నాని తన నెక్స్ట్ సినిమా శిబి చక్రవర్తితో చేస్తున్నట్టు సమాచారం. ఈ డైరెక్టర్ గత సంవత్సరం శివకార్తికేయన్ తో డాన్ సినిమా రూపొందించి హిట్ కొట్టారు. ఆ సినిమా తెలుగులో కాలేజ్ డాన్ పేరుతో విడుదల అయ్యి హిట్ టాక్ సంపాదించుకుంది. దాంతో నాని నెక్స్ట్ సినిమా ఈ డైరెక్టర్ తో చేస్తున్నారు అనంగానే అంచనాలు ఇంకా పెరిగాయి. ప్రస్తుతం అయితే నాని హాయ్ నాన్న సినిమా ప్రమోషన్స్ చేస్తూనే మరొక పక్క సరిపోదా శనివారం సినిమాకి కూడా సిద్ధం అవుతున్నారు. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎస్ జె సూర్య ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో నటిస్తున్నారు.

ALSO READ : ఈ వ్యక్తుల గురించి తెలియకుండా మాట్లాడుతున్నారు..! ఇలా ఆలోచించడం అవివేకం ఏమో..?


End of Article

You may also like