ఈ వ్యక్తుల గురించి తెలియకుండా మాట్లాడుతున్నారు..! ఇలా ఆలోచించడం అవివేకం ఏమో..?

ఈ వ్యక్తుల గురించి తెలియకుండా మాట్లాడుతున్నారు..! ఇలా ఆలోచించడం అవివేకం ఏమో..?

by Mohana Priya

Ads

మన హీరోలు అంటే మనకి అభిమానం ఉండడం సహజమే. కానీ, మన హీరోల మీద అభిమానంతో ఇంకొక హీరోని తక్కువ చేసి మాట్లాడడం మాత్రం తప్పు. ఇటీవల కాలంలో ఇలాంటివి చాలా ఎక్కువ అయ్యాయి. మా హీరో తోపు అని అనడం బాగానే ఉంటుంది.

Video Advertisement

మీ హీరో మాత్రం దేనికి పనికిరాడు అనడం మాత్రం కాస్త అతిగా అనిపిస్తుంది. ఇటీవల ఒక పెద్ద తెలుగు హీరో, ఇంకొక పెద్ద హిందీ హీరో మధ్య కాంపిటీషన్ ఎక్కువ అవ్వడంతో ఈ పెద్ద తెలుగు హీరో ఫ్యాన్స్ హిందీ హీరోని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు.

what is happening with dunki movie

ఆ హీరోలు ఎవరో పేర్లు చెప్పకుండానే చాలా మందికి అర్థం అయిపోయి ఉంటుంది. వాళ్లే. బాహుబలి తర్వాత ప్రభాస్ భారతదేశ వ్యాప్తంగా చాలా ఫేమస్ అయ్యారు. ఒకరకంగా చెప్పాలి అంటే తెలుగు సినిమాని అంతర్జాతీయంగా గుర్తింపు పొందేలా చేయడంలో ప్రభాస్ పాత్ర కూడా కొంతమేరకు ఉంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన మూడు సినిమాలు కూడా అంచనాలని అందుకోలేకపోయాయి. అయినా కూడా ప్రభాస్ నెక్స్ట్ సినిమాలకి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది.

what is happening with dunki movie

ఇప్పుడు ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమా మీద భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా విడుదల అవుతుంది. ఇందులో అంచనాలు ఎక్కువగా ఉండడానికి మొదటి కారణం ప్రభాస్ అయితే, మరొక కారణం ప్రశాంత్ నీల్. అయితే సెప్టెంబర్ లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడి డిసెంబర్ లో విడుదల అవుతోంది. కానీ డిసెంబర్ కి చాలా నెలల ముందే షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డంకీ సినిమా విడుదల అవుతుంది అని ప్రకటించారు. అయితే ఇప్పుడు సలార్ కూడా దగ్గర దగ్గర అదే సమయంలో రిలీజ్ అవుతోంది.

what is happening with dunki movie

సలార్ డేట్ మారే అవకాశం లేదు. అయితే, సడన్ గా డేట్ మార్చిన సలార్ టీం తగ్గనప్పుడు, డిసెంబర్ లో సినిమా రిలీజ్ అవుతుంది అని ఎప్పుడో చెప్పిన డంకీ టీం మాత్రం ఎందుకు తగ్గుతుంది? వీళ్లు కూడా చెప్పిన డేట్ కి వస్తాం అని చెప్పారు. దాంతో ప్రభాస్ అభిమానులు షారుఖ్ ఖాన్ మీద ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. ఇప్పటికే, డంకీ కి సంబంధించి ఒక చిన్న టీజర్, అలాగే ఒక పాట విడుదల చేశారు. టీజర్ బాగుంది. కానీ పాట మాత్రం అంత గొప్పగా ఏమీ లేదు. దాంతో, ” మా డైనోసార్ వస్తే, మీ డాంకీ (డంకీ) పక్కకి తప్పుకోవాల్సిందే. మర్యాదగా సినిమా రిలీజ్ డేట్ వాయిదా వేసుకుంటే మీకే మంచిది” అంటూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు.

what is happening with dunki movie

కానీ ఇక్కడ ప్రభాస్ మీద అభిమానం వల్ల ఏమో కానీ, లేదా తెలుగు సినిమా అనే భాషాభిమానం వల్ల ఏమో కానీ, ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. బాలీవుడ్ లో గొప్ప సినిమాలు రావు, కలెక్షన్స్ రావు, బాలీవుడ్ పని అయిపోతోంది అని అనుకునే సమయానికి పఠాన్ సినిమాతో ఒక్క సారిగా మళ్లీ బాలీవుడ్ కి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చిన నటుడు షారుఖ్ ఖాన్. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో కూడా విడుదల అయ్యి కలెక్షన్స్ సాధించింది. భారతీయ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్స్ అనే ప్రస్తావన వస్తే మొదటి అయిదు హీరోల్లో ఉండే వ్యక్తి షారుఖ్ ఖాన్.

what is happening with dunki movie

ఇటీవల వచ్చిన రొటీన్ స్టోరీ ఉన్న జవాన్ సినిమాతోనే 1000 కోట్లు కొట్టారు. ఇంత రొటీన్ సినిమాని డబ్బింగ్ లో చూసి తమిళ్, తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరించారు. అందుకే అంత కలెక్షన్స్ వచ్చాయి. అలాంటి వ్యక్తిని ఇంత తక్కువ అంచనా ఎలా వేస్తున్నారు? ఇంక ఇప్పుడు ఈ సినిమా టీజర్, పాటల సంగతి అంటారా? సినిమాకి దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ. అంతకు ముందు మున్నాభాయ్ ఎంబిబిఎస్, లగే రహో మున్నాభాయ్, త్రీ ఇడియట్స్, పీకే వంటి సినిమాలు రూపొందించారు.

what is happening with dunki movie

ఈ సినిమాల ట్రైలర్ కానీ, లేదా సినిమాకి సంబంధించి విడుదల చేసిన ప్రోమో కానీ సినిమా గురించి పెద్దగా ఆసక్తి క్రియేట్ చేయకుండానే ఉన్నాయి. పీకే సినిమా విషయానికి వస్తే అమీర్ ఖాన్ ఒక ఏలియన్ అని మాత్రమే చూపించారు. కానీ సినిమాకి వెళ్లి చూసిన తర్వాత ఎన్నో ఎమోషనల్ అంశాలని ఈ సినిమాలో మాట్లాడారు. ఆయన సినిమాలు అన్నీ ఇలాగే ఉంటాయి. పైన చెప్పిన నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు సౌత్ లో రీమేక్ చేశారు.

what is happening with dunki movie

అందులో ఒక సినిమా మెగాస్టార్ చిరంజీవికి గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇంకొక విషయం ఏమిటంటే మన ప్రభాస్ కి ఫేవరెట్ డైరెక్టర్ కూడా ఈయనే. చాలా మంది, “ఏ నమ్మకంతో ప్రభాస్ సినిమాకి పోటీగా మీ సినిమా విడుదల చేస్తున్నారు?” అని కామెంట్స్ చేస్తున్నారు. హీరో, డైరెక్టర్ పాత రికార్డుల గురించి మర్చిపోయి మాట్లాడుతున్నారు ఏమో. ఒకరు తక్కువ అంచనా వేసిన ప్రతిసారి తనని తాను నిరూపించుకొని, తన స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు అని తన సినిమాలతో పదే పదే చెప్తున్న హీరో. మరొకరు స్ట్రాంగ్ కంటెంట్ కి పెట్టింది పేరు అయిన డైరెక్టర్.

what is happening with dunki movie

తన సినిమాలతో ప్రతి సారి ప్రేక్షకులని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు. కంటతడి పెట్టించే ఎన్నో ఎమోషన్స్ ని తెర మీద చూపిస్తారు. ఇద్దరికీ తమకంటూ ఒక స్పెషాలిటీ ఉంది. ఈ నమ్మకం చాలదా సినిమా విడుదల చేసుకోవడానికి? మన సినిమాని మనం పొగుడుతున్నాం అంటే సరే. కానీ అవతల పక్క ఉన్న స్టార్ హీరో సినిమాని తక్కువ చేసి మాట్లాడడం అనేది మన అవివేకం అవుతుంది ఏమో. చెప్పలేం. ఎమోషన్ బాగా పండితే ఈ సినిమాకి కూడా అంతే మంచి రెస్పాన్స్ వస్తుంది ఏమో.

ALSO READ : మా ప్రభాస్ సినిమాని ఇలా చేశారు ఏంటయ్యా..? హిందీ ఛత్రపతి సినిమాలో ఈ సీన్ చూస్తే నవ్వు ఆపుకోలేరు..?


End of Article

You may also like