యానిమల్ లో రణబీర్ సోదరిగా నటించింది ఎవరో తెలుసా? హీరోయిన్ కి ఉన్న క్రేజ్ ఉంది…!

యానిమల్ లో రణబీర్ సోదరిగా నటించింది ఎవరో తెలుసా? హీరోయిన్ కి ఉన్న క్రేజ్ ఉంది…!

by Mounika Singaluri

Ads

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన జంటగా తెలుగు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న చిత్రం యానిమల్. ఈ చిత్రం డిసెంబర్ ఒకటో తారీఖున ఇండియా వైడ్ విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్స్ భారీ హైప్ తీసుకొచ్చాయి. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత సందీప్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న చిత్రం కావడంతో తెలుగులో కూడా ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడింది.

Video Advertisement

మొన్నటి వరకు యానిమల్ సినిమా రన్ టైం బాగా ఎక్కువగా ఉందని వాదన వినిపించింది. ఈ సినిమాకి సెన్సార్ కూడా ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. అయితే ఎప్పుడైతే ట్రైలర్ విడుదల అయిందో జనాలకి ఉన్న అనుమానాలన్నీ తీరిపోయాయి.


ట్రైలరే ఈ రేంజ్ లో ఉంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ లో రణబీర్ కపూర్ కి సోదరిగా ఒక ఆమె నటించింది. ఆమెను చూడగానే ఆమె ఎవరూ? అంటూ ఆరాల తీయడం మొదలుపెట్టారు. ఆమె పేరు సలోని బాత్ర. పుట్టింది ఢిల్లీలో, చదివింది చెన్నైలో. ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్న సలోని మొదట ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మాలిని అగర్వాల్ వద్ద స్టైలిస్ట్ గా చేరింది. 2013లో మొదటిసారిగా అన్ నేమెడ్ క్రై-మ్ అనే షార్ట్ ఫిలింలో నటించింది. తర్వాత బుల్లితెరపై లైఫ్ సహి హై అని సీరియల్ లో కూడా నటించింది.

తర్వాత గోస్ట్ సిరీస్, వైట్ మేటర్స్, తైష్ వంటి చిత్రాల్లో కూడా నటించింది. ఈమె నటించిన సీరియల్లు, మూవీల ద్వారా బాలీవుడ్ లో ఈమెకు మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం యానిమల్ సినిమానే కాకుండా 200: హల్లా హో, ద నాట్ సినిమాల్లో కూడా నటిస్తుంది. యానిమల్ ట్రైలర్ చూస్తే ఈ సినిమాలో సలోని మంచి కీలకపాత్రలో నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమావిజయం సాధిస్తే ఈమె పాత్రకి మంచి పేరు వస్తే తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించే అవకాశం లేకపోలేదు. ఈమెకు స్టార్ హీరోయిన్ కి ఉన్న క్రేజ్ ఉంది. అందంలో కూడా హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోదు.

https://www.instagram.com/p/Cz2_xtwJCWu/

Also Read:తెలుగులో కూడా యానిమల్ హిట్ అవుతుందని నమ్మకంతో దిల్ రాజు ఇంత రిస్క్ చేస్తున్నారా? ఎంతకి కొన్నారంటే…?


End of Article

You may also like