చనిపోతూ కూడా ఈ AP సచివాలయ ఉద్యోగిని చేసిన ఈ పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.!

చనిపోతూ కూడా ఈ AP సచివాలయ ఉద్యోగిని చేసిన ఈ పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.!

by Mounika Singaluri

Ads

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని నానుబాలు వీధిలో గల సచివాలయంలో వీఆర్వోగా విధులు నిర్వహిస్తోన్న బి మౌనిక నాలుగు రోజుల కిందట ఘోర రోడ్డు ప్రమాదానికి గురయింది. భోజనానికి వెళ్లే సమయంలో సచివాలయం నుంచి బయటకు వచ్చిన ఆమె శ్రీకాకుళం డే అండ్‌ నైట్ జంక్షన్ సమీపంలోని వినాయకుడి ఆలయం వద్ద తన స్కూటిపై రోడ్డును దాటుతుoడగా అతివేగంగా అడ్డంగా వచ్చిన వేరొక బైక్ ఢీ కొట్టిoది.

Video Advertisement

అంతే బైక్ వేగానికి స్కూటీపై వెళుతున్న మౌనిక ఎగిరి రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో మౌనిక తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదం దృశ్య రోడ్డు పక్కన ఉన్న సీసీ కెమెరాలో కూడా స్పష్టంగా రికార్డ్ అయింది.మౌనిక తలకు బలమైన గాయం అవ్వడంతో తొలిత శ్రీకాకుళం లోని రిమ్స్ ఆసుపత్రికి ఆమెను తరలించారు.

అక్కడ వైద్యం చేసిన వైద్యులు పరిస్థితి విషమంగా వుందని చెప్పడంతో శ్రీకాకుళంలోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ వైద్యులు కూడా కండిషన్ సీరియస్ గా వుందని చెప్పడంతో విశాఖలోని మరో కార్పొరేట్ హాస్పిటల్ కి తరలించారు.అక్కడ వైద్యులు కూడా చేతులు ఎత్తేయడంతో చివరికి చేసేది లేక తల్లిదండ్రులు శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ చేసారు. అయితే బ్రెయిన్ డెడ్ కావడంతో జీవచ్ఛవంలా ఉన్న మౌనిక పరిస్థితిని చూసిన వైద్యులు అవయవ దానంపై తల్లిదండ్రులను సంప్రదించగా, దానికి అంగీకరించి ముందుకు వచ్చారు.ఆసుపత్రి యాజమాన్యం జీవన్ ధాన్ కి అనుమతి కోరగా వెంటనే ప్రభుత్వం అందుకు అనుమతి ఇచ్చింది.

దీంతో ఆమె అవయవాల్లో గుండె, రెండు మూత్ర పిండాలు, రెండు కళ్లు మాత్రమే అవయవ దానం కోసం పని చేస్తాయని వైద్యులు ధృవీకరించి వాటిని సేకరించారు.గుండెను జెమ్స్ హాస్పిటల్ నుండి తిరుపతి లో ఉన్న సుస్మిత అనే పేషెంట్ కోసం గ్రీన్ ఛానల్ ద్వారా తరలించారు. శ్రీకాకుళం జెమ్స్ హాస్పిటల్ నుంచి అంబులెన్స్ లో ఆగ మేఘాల మీద విశాఖ ఎయిర్ పోర్ట్ కు తరలించి అక్కడ నుంచి చార్టెడ్ ఫ్లైట్ లో రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు.

మౌనిక గుండెను తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి, ఒక మూత్రపిండం వైజాగ్ కు, మరొకటి జెమ్స్ ఆసుపత్రికి, రెండు కళ్లను రెడ్ క్రాస్ వారికి అప్పజెప్పారు. అవయవదానానికి అంగీకరించి ముందుకు వచ్చిన మౌనిక తల్లి తండ్రులను అందరూ అభినందించారు.అవయవదానం ద్వారా మౌనిక జీవించే ఉంటుందన్న నమ్మకంతో ఆర్గాన్స్ డొనేషన్ కి అంగీకరించామని మౌనిక తల్లి ఉమాదేవి తెలిపారు.

Also Read:రైలులో మహిళతో వ్యక్తి అనుచిత ప్రవర్తన… ఆ మహిళ ఏం చేసింది అంటే…?


End of Article

You may also like