వేలకోట్ల ఆస్తికి ఒక మెకానిక్ అధినేత.. అతని సక్సెస్ స్టోరీ వింటే శభాష్ అనాల్సిందే?

వేలకోట్ల ఆస్తికి ఒక మెకానిక్ అధినేత.. అతని సక్సెస్ స్టోరీ వింటే శభాష్ అనాల్సిందే?

by Harika

Ads

మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని ఎంతోమంది నిరూపించారు. ఇప్పటికి కూడా చాలామంది సాధారణ పౌరుల నుంచి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదిగారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే వ్యక్తి కూడా ఒకరు. కేరళలో జన్మించి ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగిన జార్జ్ వి నేరేపరంబిల్. ఇంతకీ ఈయనెవరు, సాధించిన సక్సెస్ ఏంటి? అన్న వివరాల్లోకి వెళితే.. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన జార్జ్ తన 11 ఏళ్ల వయసు నుంచి తన తండ్రికి వాణిజ్య పంటల వ్యాపారంలో సహాయం చేశాడు. అంతే కాకుండా మార్కెట్‌కు వస్తువులను రవాణా చేయడం, బేరం చేయడం వంటివి చేసేవాడు.

Video Advertisement

దీంతో అతి తక్కువ కాలంలోనే వ్యాపారంలో మెళుకువలు తెలుసుకున్నాడు. ఆ తరువాత ఈయన కొంత కాలం మెకానిక్‌గా కూడా పనిచేశాడట. ఆ తరువాత 1976లో షార్జాకు రావడంతో అతని జీవితం మలుపు తిరిగింది. అప్పట్లో అభివృద్ధి చెందుతున్న ఆ ప్రాంతంలో ఎడారి వేడికి తప్పకుండా ఎయిర్ కండిషనింగ్ రంగం పురోగతి సాధిస్తుందని గ్రహించాడు. ఈ ఆలోచనే నేడు జీఈఓ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని పిలిచే ఒక భారీ సామ్రాజ్యంగా ఏర్పడింది. నేడు గల్ఫ్ ప్రాంతంలో ప్రముఖ భారతీయ వ్యాపార దిగ్గజాలలో జార్జ్ వి నేరేపరంబిల్ ఒకరుగా పాపులర్ అయ్యాడు. ఈ రోజు బుర్జ్ ఖలీఫాలో ఒకటి రెండు కాదు ఏకంగా ఏకంగా 22 లగ్జరీ అపార్ట్‌మెంట్‌లను కొనుగోలు చేసినట్లు సమాచారం.

అంతే కాకుండా జార్జ్ అపార్ట్‌మెంట్‌ల గోడలు, సీలింగ్‌లు, అంతస్తులు బంగారంతో చేసిన డెకర్‌తో కప్పబడి ఉన్నట్లు నివేదించారు. అయితే ఒకప్పుడు తన బంధువుల్లో ఒకరు నువ్వు బుర్జ్ ఖలీఫాలో ప్రవేశించలేవని ఆటపట్టించాడట. కానీ 2010లో జార్జ్ ఆ భవనంలో ఒక అపార్ట్‌మెంట్‌ని అద్దెకు తీసుకోగలిగాడు. ఇప్పుడు ఏకంగా 22 అపార్ట్‌మెంట్‌లను కొనుగోలు చేసే వాటికి అధినేతగా ఉన్నారు. భవిష్యత్తులో మరిన్ని సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. కాగా ఆయన మొత్తం ఆస్తి రూ.4800 కోట్లు అని సమాచారం. ప్రస్తుతం బుర్జ్ ఖలీఫా అందించే 900 అపార్ట్‌మెంట్‌లలో దాదాపు 150 అపార్ట్‌మెంట్‌లలో భారతీయులే ఉన్నారని చెబుతారు. అందులో కూడా ఎక్కువ అపార్ట్‌మెంట్‌ లను కలిగిన వ్యక్తి నేరేపరంబిల్ కావడం విశేషం. ఒకప్పుడు మెకానిక్‌గా పనిచేసి నేడు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.


End of Article

You may also like