Ads
గోషామహల్.. రాష్ట్రంలోనే అత్యధిక కమర్షియల్ టాక్స్ కట్టే నియోజకవర్గంగా పేరు పొందిన ఈ గోషామహల్ నుంచి ముచ్చటగా మూడవసారి కూడా ఎమ్మెల్యేగా ఒకే వ్యక్తి ఎన్నుకోబడ్డాడు. పాన్ డబ్బాల దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారాలకు అడ్డ ఆయన గోషామహల్ నుంచి రాజా సింగ్ మరోసారి బీజేపీ తరఫున బరిలోకి దిగాడు. ఈసారి ఆయనకి ఆపోజిట్ గా బీఆర్‌ఎస్ నుంచి నందకిషోర్ వ్యాస్,కాంగ్రెస్ నుంచి మొగిలి సునీత పోటీలోకి దిగినప్పటికీ.. విజయం రాజాసింగ్‌నే వరించింది.
Video Advertisement
వరుసగా మూడవసారి కూడా గోషామహల్ పై రాజాసింగ్ కాషాయ జెండా ఎగిరింది. తన ప్రత్యర్థి బీఆర్‌ఎస్ అభ్యర్థి నందకుమార్ వ్యాస్ పై రాజాసింగ్ 21,457 ఓట్ల మెజార్టీతో రాజాసింగ్ గెలిచాడు.గోషామహల్ హైదరాబాద్ మహానగరానికి గుండెకాయలాంటిది..దీని మినీ ఇండియాగా అని కూడా అంటారు. ఈ గోషామహల్ నియోజకవర్గం 2009లో ఏర్పడక ముందు మహారాజ్ గంజ్ అనే వారు.2009 ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ముఖేశ్ గౌడ్ ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
ఆ తర్వాత 2014,2018 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గా రాజాసింగ్ ఈ నియోజకవర్గంలో విజయం సాధించారు. సుమారు మూడు లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గ పరిధిలోకి గోషామహల్, అఫ్జల్ గంజ్, ఆగపూర, బొగ్గులకుంట, దూల్ పేట, రామకోటి, సుల్తాన్ బజార్, మోజాం జాహీ లాంటి మార్కెట్ ప్రాంతాలు వస్తాయి. 2018 ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేసిన బిజెపి పార్టీ తరఫున గెలిచిన ఏకైక సీటు ఇదే కావడం విశేషం.
End of Article