అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేలుగా గెలిచి…చరిత్ర సృష్టించిన ఈ ముగ్గురు కాంగ్రెస్ యువనేతలు ఎవరంటే.?

అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేలుగా గెలిచి…చరిత్ర సృష్టించిన ఈ ముగ్గురు కాంగ్రెస్ యువనేతలు ఎవరంటే.?

by Harika

Ads

మునుపెన్నడు లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ తిరిగి తన ప్రభంజనం కొనసాగించింది. ముఖ్యమైన స్థానాలలో మెజారిటీ దక్కించుకొని యువ కాంగ్రెస్ అభ్యర్థులు తమ సత్తా చాటారు. కాకలుతీరిన ప్రత్యర్ధి ఉద్దండులను మట్టికరిపించారు.

Video Advertisement

తెలంగాణ లో ఇప్పటివరకు రాజకీయాలతో ఏటువంటి సంబంధం లేకుండా ఉన్న యువతరం తమ మొదట్టి ఎన్నికల్లోనే విజయకేతనం ఎగురవేశారు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1. మామిడాల యశస్విని రెడ్డి

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టి అభ్యర్థి గా పోటీ చేసిన 26 ఏళ్ల మామిడాల యశస్విని రెడ్డి సంచలన విజయం సాధించారు. నిజానికి పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థిగా మొదట విదేశాల నుంచి వచ్చిన హనుమాండ్ల ఝాన్సీరెడ్డిని ప్రకటించారు. అయితే ఆమె భారత పౌరసత్వం కోసం చేసిన అభ్యర్థన పై నిర్ణయం తీసుకోవడం ఆలస్యం అవ్వడంతో.. ఆమె స్థానంలో ఆమె కోడలు యశస్విని రెడ్డి పోటీ చేసే అవకాశం దక్కించుకున్నారు.

#2. మైనంపల్లి రోహిత్

అలాగే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు కొడుకు మైనంపల్లి రోహిత్ (26 ఏళ్లు).. మెదక్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే రోహిత్ మొదట బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగాలని భావించినా.. టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ తీర్థం తీసుకున్నారు. అతను తన ప్రత్యర్థి అసెంబ్లీ డిప్యూటీ సీఎం..బీఆర్ఎస్ అభ్యర్థి..పద్మా దేవేందర్‌రెడ్డి పై విజయం సాధించారు.

#3.చిట్టెం పర్ణికారెడ్డి

అలాగే నారాయణపేట నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి..సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రాజేందర్‌రెడ్డి కి ఎదురుగా కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగింది చిట్టెం పర్ణికారెడ్డి(30 ఏళ్లు) . ఈమె భాస్కర వైద్య కళాశాలలో రేడియాలజిస్ట్ విభాగంలో పీజీ చేస్తున్నారు. పర్ణిక తాత చిట్టెం నర్సిరెడ్డి మక్తల్‌ ఎమ్మెల్యేగా పనిచేయగా, తండ్రి చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డి పీసీసీ సభ్యుడిగా చేశారు. 2005లో జరిగిన మావోయిస్టు కాల్పుల్లో పర్ణిక ఒకేసారి తాతని ..తండ్రిని.. ఇద్దరినీ కోల్పోయింది. ఈసారి ఎన్నికల్లో మహిళా కోటాలో సీటు దక్కించుకున్న ఆమె తన ప్రత్యర్థి పై గెలుపు సాధించారు.

ఇలా ఈసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువ అభ్యర్థులు.. ఎవరు ఊహించని విధంగా విజయ డంఖా మోగించారు.


End of Article

You may also like