Ads
హ్యాట్రిక్ సాధించాలనే కేసీఆర్ కలని వమ్ము చేస్తూ తెలంగాణలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. బీఆర్ఎస్ పై ప్రజలలో వ్యతిరేకతని తీసుకురావడం లో కాంగ్రెస్ సక్సెస్ అయ్యి అధికార పీఠాన్ని సొంతం చేసుకుంది. ఈనెల 9వ తారీఖున కాంగ్రెస్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. అందుకుగాను తెలంగాణలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను సోమవారం సమావేశపరచాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలోనే కాబోయే సీఎం ఎవరు అన్నది హై కమాండ్ నిర్ణయం తీసుకుంటుంది.
Video Advertisement
అలాగే మంత్రివర్గ కూర్పు పై కూడా ఇదే సమావేశంలో ఒక అంచనాకి రాబోతున్నట్లుగా సమాచారం.అయితే కీలకమైన హోమ్ మంత్రి స్పీకర్ పదవులు విషయంలో ఇప్పటికే అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. సీఎం,సీఎల్పీ లను కూడా హై కమాండే నిర్ణయిస్తుంది. అయితే సీఎం ఎంపిక విధానం కర్ణాటక తరహా లోనే ఉండబోతున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు సీఎం అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇద్దరిలో ఒకరికి సీఎం, మరొకరికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తారు అని చర్చ నడుస్తుంది.
కాబినెట్ లో స్థానం దక్కే అవకాశం ఉన్న కాండిడేట్స్ వీరే:
అదిలాబాద్ జిల్లా :
- వివేక్ వెంకట్ స్వామీ (చెన్నూర్)
- ప్రేమ్ సాగర్ రావు (మంచిర్యాల)
- వెడ్మ బోజ్జు ( ఖానాపూర్)
రంగారెడ్డి :
- మల్ రెడ్డి రంగారెడ్డి ( ఇబ్రహీంపట్నం )
- గడ్డం ప్రసాద్ (వికారాబాద్)
- రామ్ మోహన్ రెడ్డి (పరిగి)
మహబూబ్ నగర్ :
- జూపల్లి కృష్ణ రావు (కొల్లాపూర్)
- వంశీ కృష్ణ (అచ్చంపేట)
- వీర్లపల్లి శంకర్ (షాద్ నగర్ )
ఖమ్మం:
- భట్టి విక్రమార్క (మధిర)
- తుమ్మల నాగేశ్వర రావు (ఖమ్మం)
- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( పాలేరు)
- కునమనేని సాంబశివ రావు (కొత్తగూడెం)
వరంగల్:
- సీతక్క (ములుగు)
- కొండ సురేఖ (వరంగల్ ఈస్ట్)
నల్గొండ:
- ఉత్తమ్ లేదా పద్మావతి
- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (నల్గొండ)
మెదక్ :
- దామోదర్ రాజనర్సింహ (అందోల్ )
నిజామాబాద్ :
- సుదర్శన్ రెడ్డి ( బోధన్)
- షబ్బీర్ అలీ (ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి)
కరీంనగర్ :
- పొన్నం ప్రభాకర్ (హుస్నాబాద్)
- శ్రీధర్ బాబు (మంథని)
- అది శ్రీనివాస్ (వేములవాడ)
End of Article