Ads
యానిమల్ సినిమాతో పాటు అధర్వ, కాలింగ్ సహస్ర వంటి సినిమాలతో డిసెంబర్ నెల ప్రారంభమైంది. అయితే యానిమల్ బంపర్ హిట్ తో డిసెంబర్ ప్రారంభమైంది. ఇప్పుడు ఈవారం రాబోతున్న సినిమాలు ఏమిటో చూద్దాం. ముందుగా నాని హీరోగా వస్తున్న సినిమా హాయ్ నాన్న. మృనాల్ ఠాకూర్ హీరోయిన్ కాగా బేబీ కియారా, శృతిహాసన్ లు కీలక పాత్రలు పోషించారు.
Video Advertisement
ఈ సినిమా ద్వారా సౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నానికి ఇది తొలి పాన్ ఇండియా సినిమా. ఈ సినిమా డిసెంబర్ 7 తారీఖున వెండితెర మీద విడుదల కానుంది. అలాగే వీరు, శ్రీహర్ష, ఖుషి చౌహన్ తారాగణంతో చండిక అనే హర్రర్ సస్పెన్స్ సినిమా కూడా డిసెంబర్ 8న వెండితెర మీద విడుదలవుతుంది. ఈ సినిమా కి తోట కృష్ణ దర్శకుడు కాగా కేవీ పాపారావు నిర్మాత. అలాగే జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ తో ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ గా మన ముందుకి వస్తున్నాడు నితిన్.
ఈ సినిమా దర్శకుడు వక్కంతం వంశీ కాగా ఈ సినిమాలో హీరోయిన్ శ్రీ లీల. మొదటిసారిగా హీరో రాజశేఖర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా కూడా డిసెంబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఇక ఓటీటీ విషయానికి వస్తే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వధువు వెబ్ సిరీస్ డిసెంబర్ 8వ తారీఖున రిలీజ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ లో మస్తీ మే రహ్నే కా డిసెంబర్ 8న రిలీజ్ అవుతుంది. అలాగే నెట్ఫ్లిక్స్ లో జిగర్ తండా డబుల్ ఎక్స్ డిసెంబర్ 8వ తారీఖున రిలీజ్ అవుతుంది.
అదే డిసెంబర్ 8వ తారీఖున లీవ్ ది వరల్డ్ బిహైండ్, ధక్ ధక్ రిలీజ్ అవుతున్నాయి. అలాగే జి ఫైవ్ లో కడక్ సింగ్ డిసెంబర్ 8వ తారీఖున,సోనీ లివ్ లో చమక్ వెబ్ సిరీస్ డిసెంబర్ 7న విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఆహా లో మా ఊరి పొలిమేర 2 డిసెంబర్ 8వ తారీఖున అందుబాటులోకి రానుంది. అలాగే స్టార్ కిడ్స్ అందరూ కలిసి నటించిన ది ఆర్చీస్ మూవీ నెట్ఫ్లిక్స్ లో డిసెంబర్ 7న విడుదలకు సిద్ధంగా ఉంది.
End of Article