Ads
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుండి తన పనితీరుతో అందరి మన్ననలు పొందుతున్నారు. అధికారంలోకి రాగానే ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసి చూపించారు. అలాగే ఎంత పెద్ద నాయకుడైనా సరే సామాన్యులకు ఎప్పుడు సేవకుడే అంటూ రేవంత్ రెడ్డి మరోసారి నిరూపించారు. రేవంత్ రెడ్డి యశోద హాస్పిటల్ లో ఆపరేషన్ పూర్తి చేసుకుని విశ్రాంతి తీసుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించేందుకు హాస్పటల్ కి వెళ్లారు. హాస్పిటల్ వద్దకు వెళ్లిన రేవంత్ రెడ్డిని కేటీఆర్ సాధరంగా ఆహ్వానించారు. దగ్గరుండి లోనికి తీసుకువెళ్లి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి వివరించారు. కెసిఆర్ తో మాట్లాడి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Video Advertisement
ఎలక్షన్ల సమయంలో ఒకరిని ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుని పెద్ద శత్రువుల వ్యవహరించిన వీరు ఇప్పుడు ఆపద వస్తే ఒకరికి తోడుగా ఒకరు ఉన్నామని సంకేతం ఇచ్చారు. ఇది చూసేందుకు చాలా ముచ్చటగాను మంచి సందేశాన్ని ఇస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎటువంటి పట్టింపులు లేకుండా ఆపద సమయంలో ఇలా ప్రతిపక్ష నాయకుడు వద్దకు వెళ్లి పరామర్శించడం ప్రజలకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ పనికి చాలా మంది రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నారు.
A cute video from Telangana 😍
Revanth Reddy, the Chief Minister of Telangana & people calling him Revanth Anna ❣️ pic.twitter.com/BY5kPMoE1M
— Darshni Reddy (@angrybirdtweetz) December 10, 2023
అయితే రేవంత్ రెడ్డి హాస్పిటల్ వద్దకు రావడంతో పోలీసులు ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. కెసిఆర్ ను పరామర్శించి తిరిగి వెళ్లే సమయంలో హాస్పటల్లో ఉన్న ఒక యువతి గట్టిగా రేవంత్ అన్నా అంటూ పిలిచింది. ఆ పిలుపుకి వెంటనే రేవంత్ రెడ్డి వెనక్కి తిరిగి చూసారు. రేవంత్ అన్న మీతో ఒక్కసారి మాట్లాడాలన్నా అనగానే … నేనే నీ దగ్గరికి వస్తాను అంటూ వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వచ్చారు. ఏమైంది అని అడగగా తన తండ్రిని హాస్పిటల్ లో చేర్చామని ఒక్క రోజుకి లక్షన్నర బిల్ అయిందని తమని ఆదుకోవాలని వేడుకుంది. వెంటనే రేవంత్ రెడ్డి ఏం కావాలో తెలుసుకుని అవసరమైన సహాయం చేయాలంటూ పక్కన ఉన్న అధికారులను ఆదేశించారు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతుంది. సీఎం అయినా కూడా సామాన్యుల పట్ల స్పందించిన తీరు చూసి చాలామంది రేవంత్ రెడ్డిని అభినందనలతో ముంచేత్తుతున్నారు.
https://twitter.com/iamRocky_1/status/1733866051593720268
End of Article