మళ్లీ దొరికిపోయావ్ గా తమన్ అన్నా..? ఈ పాట కూడా కాపీయేనా..?

మళ్లీ దొరికిపోయావ్ గా తమన్ అన్నా..? ఈ పాట కూడా కాపీయేనా..?

by Mohana Priya

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తి అయినట్టు సమాచారం. సినిమా బృందం ప్రస్తుతం పాటల చిత్రీకరణలో ఉంది. సినిమా మొదటి పాట ఇప్పటికే విడుదల అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Video Advertisement

ఈ సినిమా నుండి రెండో పాట కూడా విడుదల అవుతుంది అని సినిమా బృందం ప్రకటించి, ఆ పాట ప్రోమో విడుదల చేశారు. తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రెండవ పాట ఓ మై బేబీ అని ప్రకటిస్తూ సినిమా బృందం ఒక పోస్టర్ తో పాటు ఒక చిన్న ప్రోమో రిలీజ్ చేశారు.

పాటలో మహేష్ బాబు, శ్రీలీల కనిపిస్తున్నారు. అయితే సాధారణంగా తమన్ చాలా పాటలని కాపీ కొట్టి తన పాటలని రూపొందిస్తారు అనే కామెంట్స్ వస్తూనే ఉంటాయి. ఇది ఇప్పుడు కాదు. ఎన్నో సంవత్సరాల నుండి తమన్ సంగీత దర్శకత్వం వహించిన పాటలు, మరొక సినిమాలో ఉన్న పాటలకు చాలా దగ్గరగా ఉండటం వంటివి జరుగుతున్నాయి. తమన్ మాత్రమే కాదు. ఇలా ఒక పాట నుండి ఇన్స్పైర్ అయ్యి తమ పాటలను రూపొందించిన సంగీత దర్శకులు చాలా మంది ఉన్నారు.

guntur kaaram fan theories

కాకపోతే తమన్ మరీ ఎక్కువగా ఇలాంటి కాపీ ట్యూన్స్ చేయడంతో, తమన్ పాట రిలీజ్ అయిన ప్రతిసారి సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ పాట మొత్తం రిలీజ్ అవ్వనే లేదు. పాట ప్రోమో మీద ఇప్పటికే కాపీ పాట అంటూ కామెంట్స్ మొదలు అయ్యాయి. ఈ పాట సడన్ గా వింటే అల వైకుంఠపురంలో సినిమాలోని బుట్ట బొమ్మ పాటని స్లోగా విన్నట్టు ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

thaman

పాట బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బుట్ట బొమ్మ పాట బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లాగానే ఉంది అని అంటున్నారు. దాంతో మళ్లీ తమన్ మీద కామెంట్స్ రావడం మొదలు అయ్యాయి. అయితే మరి కొంత మంది మాత్రం, “ఇప్పుడే ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేయడం? పాట రిలీజ్ అయ్యాక వేరేగా ఉంటుంది ఏమో. వెయిట్ చేసి చూద్దాం” అంటూ పాజిటివ్ గా కూడా మాట్లాడుతున్నారు. మరి పాట ఎలా ఉంటుందో తెలియాలి అంటే పాట రిలీజ్ అయ్యేంత వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం సినిమా బృందం షూటింగ్ చేస్తూనే మరొక పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేస్తున్నారు.

watch video :

ALSO READ : ఇలాంటి కాన్సెప్ట్ మీద కూడా సినిమా తీస్తారా.? సెన్సేషన్ గా మారిన ఈ సినిమా చూసారా.?


End of Article

You may also like