ఇలాంటి కాన్సెప్ట్ మీద కూడా సినిమా తీస్తారా.? సెన్సేషన్ గా మారిన ఈ సినిమా చూసారా.?

ఇలాంటి కాన్సెప్ట్ మీద కూడా సినిమా తీస్తారా.? సెన్సేషన్ గా మారిన ఈ సినిమా చూసారా.?

by Mounika Singaluri

మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి తాజాగా నటించిన చిత్రం కాదల్ ది కోర్. ఈ చిత్రం నవంబర్ 23న విడుదల అయ్యి మంచి కలెక్షన్స్ ని అందుకుంది. కానీ ఈ చిత్రం విడుదలకు ముందు నుంచే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. మమ్ముట్టి ఎంత పెద్ద హీరో అనేది చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్ల నుంచి తన కెరీర్ ని పై స్థాయిలో ఉంచుతూ మూడు జాతీయస్థాయి అవార్డులను కూడా గెలుచుకున్న మమ్ముట్టి ఈసారి కొత్తగా ఒక గే పాత్రలో కనిపించారు. ఒక సంసార బాధ్యతలతో ఉన్న గే సమాజాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనే కాన్సెప్ట్ ఈ చిత్రం ఉండబోతుంది. అయితే ఈ చిత్రం గురించి చెప్పిన వెంటనే కాంట్రవర్సీలు ఎక్కువగానే వచ్చాయి. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది “ద గ్రేట్ ఇండియన్ కిచెన్” డైరెక్టర్ జియో బేబీ. జియో బేబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా అనగానే ఫాలోవర్స్ లోనూ, ఫ్యాన్స్ లోనూ ఆసక్తి ఇంకా పెరిగింది. ఈ సినిమాలో కథానాయకగా జ్యోతిక నటించడంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ భారీ అంచనాలకు రేగాయి. కానీ ఎప్పుడైతే టీజర్ రిలీజ్ చేశారు అప్పుడే గే పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు అన్న విషయం మీద చాలామంది కాంట్రవర్సీలు వచ్చాయి.

Video Advertisement

ఈ వయసులో కూడా ఇలాంటి పాత్రలు అవసరమా? దీనివల్ల సమాజానికి చెప్పుకొస్తుంది ఏంటి? ఇంత మర్యాదగల మనిషి తన మర్యాదను కోల్పోయేటట్టు ఇలాంటి పాత్రలు చేయడం ఏంటి అని విమర్శలు ఇస్తున్నారు. ఇక ఈ కథ విషయానికొస్తే సినిమాలో మమ్ముట్టి పెళ్లయిన తర్వాత పాలిటిక్స్ లోకి రావాలనుకుంటారు. అదే సమయంలో తన భార్య అయిన జ్యోతిక విడాకులకు అప్లై చేస్తుంది. దానికి కారణం అతను గే అని తెలియడం. సమాజంలో అతనికి ఎలాంటి సమస్యలు వస్తాయి అనే దానిమీద ఈ సినిమా నడుస్తుంది. ఈ సినిమా ఎన్ని కాంట్రవర్సీలకు గురైనా సరే మంచి రెస్పాన్స్ నే ప్రజల దగ్గర నుంచి అందుకుంది. సినిమా విడుదలై మంచి కలెక్షన్స్ ని కూడా సంపాదిస్తుంది. ఇప్పటికీ కేరళలో హౌస్ ఫుల్ షోస్ నడుస్తున్నాయి.

ఈ సినిమా మీద కాంట్రవర్సీల గురించి జవాబు ఇస్తూ ఈ సినిమా కేవలం ఇప్పుడున్న మనుషులకు ఒక ఇన్స్పైరింగ్ మూవీ గా అనిపించాలి. అదే పరిస్థితుల్లో ఎవరు ఉన్నా వాళ్ళకి ఈ మూవీ ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి. అందుకే అలాంటి వాళ్ల కోసమని ఈ సినిమా తీశాము. నేను ఈ కథ చెప్పిన వెంటనే మమ్ముట్టి గారికి ఈ సినిమా స్టోరీ అర్థమయ్యి ఈ కథకు ఒప్పుకున్నారు అని జియో బేబీ చెప్పారు. ఎన్ని కాంట్రవర్సీలకు గురైన సరే ఆఖరికి సినిమా హిట్ గా నిలవడంతో మంచి కలెక్షన్లు అందుకుని హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ పాత్రలను పోషించినందుకు మమ్ముట్టి ,జ్యోతికలకి కూడా మంచి పేరు వచ్చింది.

 


You may also like

Leave a Comment