మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ చూశారా… అచ్చం జూనియర్ ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ లా ఉన్నాడు…

మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ చూశారా… అచ్చం జూనియర్ ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ లా ఉన్నాడు…

by Mounika Singaluri

Ads

నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞతేజ టాలీవుడ్ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈపాటికి నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ జరగాల్సి ఉన్నా కూడా బాలకృష్ణ సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. అయితే 2024 సంవత్సరంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలకృష్ణ తాజాగా ప్రకటించారు. టాలీవుడ్ లోని సెండ్సేషనల్ డైరెక్టర్ ఒకరు మోక్షజ్ఞ తేజ డెబ్యూ మూవీ ని డైరెక్ట్ చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Video Advertisement

అయితే ఇప్పుడు మోక్షజ్ఞ తాజా లుక్ బయటకు వచ్చింది. ఆలుకులో మోక్షజ్ఞను చూసిన నందమూరి అభిమానులు అచ్చం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఉన్నాడు అంటూ పొగిడేస్తున్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా లోకేష్ ను ఆయన సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్, బావమరిది మోక్షజ్ఞతేజ కలిసి సంఘీభావాన్ని ప్రకటించారు.

లోకేష్ తో కలిసి పాదయాత్రలో నడుస్తూ అభిమానులకు అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు. అ పాదయాత్రలో మోక్షజ్ఞ వ్యవహార శైలి, నడక తీరు చూసిన ఎవరైనా సరే అచ్చం జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ పోటీలు కనిపిస్తున్నాయని కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే నందమూరి బాలకృష్ణ కి తగ్గ వారసుడు వచ్చాడని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇంకా ఫస్ట్ మూవీ రాకుండానే మోక్షజ్ఞ కి ఇంత క్రేజ్ ఉందంటే ఒకసారి డెబ్యూ మూవీ రిలీజ్ అయ్యి మంచి మంచి సినిమాలు పడితే స్టార్ స్టేటస్ అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.


End of Article

You may also like