Ads
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మధ్య మధ్యలో ఖాళీ దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తున్నారు. తన పార్టీని నడపడం కోసమే సినిమాలు చేస్తున్నట్లు ఆయన ఎప్పుడో చెప్పారు. అయితే ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. వాటిలో క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న హరిహర వీరమల్లు అయితే షూటింగ్ ప్రారంభమై మూడు సంవత్సరాలు దాటుతుంది. అయితే ఆ సినిమా ఇంకా పూర్తి కాలేదు.ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మరో 30 రోజులు డేట్లు కేటాయించాల్సి ఉంటుందని మేకర్స్ తెలిపారు.
Video Advertisement
ఇది కాకుండా సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా సగం పైనే పూర్తయింది. ఇది కాకుండా డివివి మూవీస్ బ్యానర్ పైన సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న OG మూవీ కూడా దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మూడు సినిమాలు కూడా పవన్ కళ్యాణ్ డేట్ ల కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ షూటింగ్ కి వచ్చే అవకాశం లేదు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగను నేపథ్యంలో రాజకీయాల్లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు.
ఈ సినిమాలన్నీ పూర్తి అవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చిన తర్వాత గాని జరగదు. ఎలా చూసుకున్నా మరో ఏడూ ఎనిమిది నెలల సమయం పడుతుంది. ఈ లెక్కన చూసుకుంటే పవన్ కళ్యాణ్ ని మళ్ళీ వెండి తెరపై చూడాలంటే 2024 దసరా సమయానికే కుదురుతుందని వర్గాలు చెబుతున్నాయి. అప్పటివరకు పవన్ ఫ్యాన్స్ వెయిట్ చేయాక తప్పదు.
End of Article