ఈసారి మంత్రి రోజాకి టిక్కెట్ లేదట… తేల్చి చెప్పేసిన జగన్…!

ఈసారి మంత్రి రోజాకి టిక్కెట్ లేదట… తేల్చి చెప్పేసిన జగన్…!

by Mounika Singaluri

Ads

ఆంధ్రప్రదేశ్ లో 2024 సార్వత్రిక ఎన్నికల వేడి అప్పుడే మొదలైపోయింది. ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు టిడిపి జనసేన పొత్తులో భాగంగా అభ్యర్థుల కసరత్తు మొదలుపెట్టేసాయి. మరోవైపు అధికార వైసిపి కూడా ఎలాగైనా మళ్ళీ ఇంకొకసారి అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తుంది. ఇందులో భాగంగా కొంతమంది మంత్రులకు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్లు ఇవ్వబోమని తేల్చి చెప్పేసింది. ఇప్పటికే టిక్కెట్ రాదని తెలిసిన చాలామంది వైసిపికి రాజీనామా చేస్తున్నారు. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 11 నియోజకవర్గాలకు కొత్త ఇన్చార్జిలు కూడా వైసిపి ప్రకటించింది.

Video Advertisement

అయితే ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్న రోజాకి వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదని వార్త ప్రచారంలో ఉంది. రోజా మంత్రిగా పనిచేస్తున్న కూడా నియోజకవర్గంలో సొంత క్యాడర్ ఆమెను వ్యతిరేకిస్తుంది. రోజా కి టికెట్ ఇస్తే అందరం కలిసి ఓడిస్తామంటూ హెచ్చరికలు ఇస్తున్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డి ఈసారి రోజా కి బదులు వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి నగరి టికెట్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నారట. రోజా కి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. రోజానే కాకుండా మరికొందరు మంత్రులు కూడా ఈసారి టిక్కెట్లు అనుమానం అనే వార్త వినిపిస్తుంది. ఇది నిజమో కాదో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.


End of Article

You may also like