Ads
సినిమాలో కంటెంట్ బాగుంటే అది చిన్న సినిమా అయిన సరే పెద్ద విజయాన్ని అందుకుంటుంది. తెలుగులో ఆ మధ్య చిన్న సినిమాగా రిలీజ్ అయిన బలగం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ప్రజలు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లపై వెళ్ళి థియేటర్లకు క్యూలు కట్టారు. ఆ మూవీ చూసి, విడిపోయిన ఫ్యామిలీ మెంబర్స్ కలిసిన సంఘటనలు కూడా చూశాం.
Video Advertisement
అయితే మరాఠీలో వచ్చిన ఒక చిన్న సినిమా ఆ రాష్ట్ర ప్రభుత్వంలో కదలికను తీసుకొచ్చింది. దానికి సంబంధించిన ఒక చట్టాన్ని గవర్నమెంట్ తీసుకువచ్చేలా చేసిన మూవీ ‘సైరత్’. అంతలా ఆ సినిమాలో ఏముందో? ఆ మూవీ కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
కులాంతర వివాహాల నేపథ్యంలో 2016లో రిలీజ్ అయిన సైరత్ మరాఠీలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. నాలుగు కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ వంద కోట్ల క్లబ్‌లో చేరింది. దాంతో బాలీవుడ్ సైతం నివ్వెరపోయింది. ఈ మూవీ సృష్టించిన సంచలనంతో మరాఠీ ఇండస్ట్రీ వైపుకు దృష్టి సారించడం మొదలుపెట్టారు. మూవీలో ఆకాష్ థోసర్, రింకు రాజ్‌గురు జంటగా నటించగా దర్శకుడు నాగరాజు మంజులే తెరకెక్కించారు. ఈ మూవీని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ మూవీని పలు భాషలలో రీమేక్ చేశారు.
ప్రశాంత్ (ఆకాష్ థోసర్) తక్కువ కులానికి చెందిన యువకుడు. అతని తండ్రి మత్స్యకారుడు. ప్రశాంత్ చదువులో రాణిస్తూ, స్థానిక క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అర్చన ధనిక, అగ్రవర్ణ భూస్వామి మరియు రాజకీయవేత్త కుమార్తె. వీరిద్దరూ కాలేజీలో చదువుతున్నప్పుడు ప్రేమలో పడతారు. అర్చన తమ్ముడు పుట్టినరోజు వేడుకలో, ప్రశాంత్, అర్చన పెరట్లో కలుసుకుంటారు. అయితే వారిని అర్చన కుటుంబం చూస్తుంది. ఆమె తండ్రి, మిగతా కటుంబసభ్యులు ప్రశాంత్ ను కొడతారు. పెద్దవాళ్ళు పెళ్లికి అంగీకరంచని గ్రహించి, ప్రశాంత్, అర్చన అక్కడి నుండి సిటీకి పారిపోతారు. ఇద్దరు పెళ్లి చేసుకున్నారా? లైఫ్ లో ఎలా స్థిరపడ్డారు అనేది మిగిలిన కథ.
సైరత్ సినిమా ప్రేరణతో మహారాష్ట్ర గవర్నమెంట్ కులాంతర వివాహాలను ప్రోత్సహించడానికి ఒక చట్టాన్ని తీసుకురావడం మరియు ప్రభుత్వ ప్రోత్సాహకాలను ఇవ్వడానికి సిద్ధం అయ్యింది. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ఆర్థిక పరమైన సమస్యలు తలెత్తకుండా జంటలో ఒకరికి గవర్నమెంట్ జాబ్ కల్పించాలనే ఆలోచన చేసింది.
Also Read: రవితేజ రీమేక్ చేయబోతున్న సినిమా ఇదేనా..? అసలు అంతగా ఏం ఉంది ఇందులో..?
End of Article