“ఇడియట్” నుండి… “సరిలేరు నీకెవ్వరు” వరకు… ప్రేమ పేరుతో “అభ్యంతరకరమైన సీన్స్” చూపించిన 8 సినిమాలు..!

“ఇడియట్” నుండి… “సరిలేరు నీకెవ్వరు” వరకు… ప్రేమ పేరుతో “అభ్యంతరకరమైన సీన్స్” చూపించిన 8 సినిమాలు..!

by Mohana Priya

Ads

సాధారణంగా ఒక మాట అంటూ ఉంటారు. ఏదైనా మనం చూసే దానిలోనే ఉంటుంది అని. సినిమాలకి కూడా ఇదే వర్తిస్తుంది. ఏ సినిమా అయినా సరే మనం చూసే చూపును బట్టి, ఆలోచనని బట్టి అది మనకి అర్థం అవుతుంది. కానీ కొన్ని సినిమాల ద్వారా మాత్రం ప్రేక్షకులకు సరైన సందేశం దొరకదు.

Video Advertisement

హీరో చేసే ప్రతి పని కరెక్ట్ అనే ఒక భ్రమలో మనం సినిమా చూస్తాం. హీరో ఏం చేసినా కూడా అది తప్పు అయ్యే అవకాశం లేదు అనుకుంటాం. దాంతో హీరో చేసే పనులని నిజ జీవితంలో చాలా మంది అనుసరిస్తూ ఉంటారు. లేదా థియేటర్ లోనే హీరో చేసే పనులకి చప్పట్లు, విజిల్స్ పడతాయి.

movies which are in OTT before one month of release..!!

ఇందులో ప్రేక్షకులు ఎక్కువగా ఎంటర్టైన్ అయ్యేది హీరో హీరోయిన్ ని ఏడిపించే విధానం. ఒక హీరోయిన్ నో చెప్తే హీరో అమ్మాయి వెనక పడి, పాటలు పాడి, అమ్మాయిని ఇబ్బంది పెట్టి ఎట్టకేలకి హీరో ప్రేమకి ఒప్పుకునేలా చేస్తాడు. ఇది ఎన్నో సంవత్సరాల నుండి సినిమాల్లో చూపిస్తున్న ఆచారం అయిపోయింది. దాంతో నిజ జీవితంలో కూడా చాలా మంది ఇలాగే చేస్తూ ఉంటారు.

Animal movie review

మళ్లీ దానికి ప్రేమ అని పేరు కూడా పెడతారు. ఇటీవల విడుదలైన యానిమల్ సినిమాలో హీరోయిన్ ని హీరో చూసిన విధానం అసలు బాగాలేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. కానీ అంతకు ముందు వచ్చిన చాలా సినిమాల్లో, అది కూడా మన తెలుగు సినిమాల్లో ఇలాంటి సీన్స్ ఉన్నాయి. అలాంటి అభ్యంతరకరమైన సీన్స్ ఉన్న సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

#1 ఇస్మార్ట్ శంకర్

ఇందులో హీరో హీరోయిన్ ని బూతులు తిడతాడు. అమ్మాయి వెనకాల పడతాడు. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెడతాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం చివరికి హీరోని ఇష్టపడుతుంది. ఇష్టపడి తీరాలి. ఎందుకంటే అతను హీరో కదా.

#2 పుష్ప

పుష్ప సినిమాలో పుష్ప రాజ్ శ్రీవల్లిని ప్రేమించిన విధానం, మొదట్లో ఆమెతో ప్రవర్తించిన విధానం ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఏ రకంగా కూడా అది ప్రేమ లాగా అనిపించదు. సినిమాలో వీరి ప్రేమ కథ సీన్స్ మాత్రం ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇంకా కొంచెం జాగ్రత్తగా రాసుకొని ఉంటే బాగుండేది ఏమో.

#3 సరిలేరు నీకెవ్వరు

ప్రతి సినిమాలో హీరోయిన్ కి ఇబ్బందులు అవుతే, ఈ సినిమాలో హీరోకి అవుతాయి. సినిమాలో ట్రైన్ లో వెళ్తున్నప్పుడు హీరోయిన్ హీరోని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అనే ఉద్దేశంతో హీరో తనని ఇబ్బంది పెట్టాడు అని ఏడ్చి, గోల చేసి, తర్వాత హీరో తనని పెళ్లి చేసుకోవాలి అని అందరి చేత అనిపించేలాగా చేస్తుంది. సినిమాలో ఏదో కామెడీ లాగా అనిపిస్తుందిలే కానీ, ఈ విషయం మాత్రం చాలా సీరియస్ విషయం కదా.

#4 అర్జున్ రెడ్డి

ఈ పేరు లేకుండా ఈ లిస్ట్ ఉండదు. ఇందులో హీరో హీరోయిన్ ని ప్రేమ పేరుతో మాట్లాడే మాటలు, హీరోయిన్ తో ప్రవర్తించే విధానం అవన్నీ నిజ జీవితంలో చేస్తే మాత్రం ప్రీతి ఊరుకున్నట్టు ఎవరు ఊరుకోరు.

#5 రెమో

చాలా మందికి ఈ సినిమా ఒక క్యూట్ లవ్ స్టోరీ అనిపిస్తుంది. హీరో హీరోయిన్ ని ఎక్కడికి పడితే అక్కడికి ఫాలో అవుతాడు. కానీ అప్పటికే నిశ్చితార్థం అయిపోయి ఉన్న అమ్మాయి వెనకాల హీరో పడి, ప్రేమ అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని ఏవేవో మాటలు చెప్పి, చివరికి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకునే లాగా చేస్తాడు. హీరో పనులన్నిటికీ ఒక జస్టిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి హీరోయిన్ పెళ్లి చేసుకోవాలి అనుకున్న వ్యక్తి మంచివాడు కాదు అని ఒక యాంగిల్ పెడతారు.

#6 నేను లోకల్

ఒక అమ్మాయి కోసం, అమ్మాయి ప్రేమ కోసం, తన తండ్రిని ఒప్పించి, కెరీర్ మీద శ్రద్ధ పెట్టి, కొన్నాళ్లు ఆ అమ్మాయి వెనకాల పడకుండా, పోలీస్ ఆఫీసర్ అయ్యి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అడిగిన వాడు విలన్ అయ్యాడు. రహస్యంగా ఇంట్లోకి వచ్చి అమ్మాయి వెనకాల పడి ఇబ్బంది పెట్టిన వాడు హీరో అయ్యాడు.

#7 ఇడియట్

హీరోయిన్ ని హీరో ఒక రకంగా బెదిరిస్తాడు. ఈ సినిమాలో హీరో చేసిన పనులు అన్నీ కూడా విలన్ పాత్ర పోషించిన వ్యక్తి చేస్తే ప్రేక్షకులకు వేరే లాగా అర్థం అయ్యేది ఏమో. హీరో పాత్ర చేసిన వ్యక్తి ఈ పనులు అన్నీ చేశాడు కాబట్టి ఇదంతా హీరోయిజం అనుకున్నారు.

#8 సర్కారు వారి పాట

సినిమాలో హీరోయిన్ ని హీరో కొడతాడు. ఎందుకంటే హీరోయిన్ అంతకుముందు హీరో ఫ్రెండ్ ని కొడుతుంది. హీరోని మోసం చేస్తుంది. కాబట్టి ఇది బాగానే ఉంది. కానీ తర్వాత హీరో ఆ అమ్మాయిని రోజు ఇంటికి పిలిచి, కాలు వేసి పడుకోవడం లాంటి సీన్స్ మాత్రం ప్రేమ లాగా అనిపించలేదు. తర్వాత హీరోయిన్ అవన్నీ చూసి ప్రేమలో పడిపోవడం అస్సలు ప్రేమ లాగా అనిపించలేదు.

ఇవి మాత్రమే కాదు. ఇంకా చాలా సినిమాల్లో కామెడీ పేరుతో చాలా పిచ్చి విషయాలని చూపించారు. అప్పట్లో ప్రేక్షకులకి సినిమాలపై సరిగ్గా అవగాహన లేక, అవన్నీ పెద్దగా అర్థం కాక హీరో ఏం చేసినా గొప్ప అనుకున్నారు. ఇప్పుడు ఈ విషయాలని పాయింట్ చేస్తున్నారు. కానీ ఒకసారి సరిగ్గా చూస్తే ఈ విషయాలు అన్నీ కూడా ఎన్నో సంవత్సరాల నుండి సినిమాల్లో ప్రేమ పేరుతో చూపిస్తూనే ఉన్నారు.

ALSO READ : 2023 లో చిరంజీవి పవన్ కళ్యాణ్ చేసిన తప్పులు ఇవే…!


End of Article

You may also like