మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఏడ్చిన యువతి..! అసలు ఏం జరిగిందంటే..?

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఏడ్చిన యువతి..! అసలు ఏం జరిగిందంటే..?

by kavitha

Ads

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత జర్నీ అమలులోకి తెచ్చింది. ఎన్నికల ప్రచారం సమయంలో ఇచ్చిన 6 హామీల నేపథ్యంలో మహాలక్ష్మీ స్కీమ్ లో భాగంగా మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు ఆర్టీసీ బసుల్లో తెలంగాణ వ్యాప్తంగా ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పిస్తున్నారు.

Video Advertisement

మహాలక్ష్మీ పథకంతో ఎప్పుడు లేని విధంగా ఆర్టీసీ బస్సులన్ని మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. మహిళలు బస్సులలో ప్రయాణాలు చేసేందుకు మెుగ్గు చూపుతున్నారు. మహిళలు కొందరు మంచి పథకం అని ప్రభుత్వాన్ని పొగుడుతున్నారు. కానీ ఈ పథకం వల్ల ఉన్న ఇబ్బందులు మెల్ల మెల్లగా వెలుగులోకి వస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణంలో, పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డీనరీ బస్సులలో మహిళలు తెలంగాణలో ఎక్కడి నుండి మరెక్కడికైనా ఉచితంగా జర్నీ చేయవచ్చు. దీంతో  మహిళలు ఆటోలు, క్యాబ్ లలో ప్రయాణం చేయడం లేదు. దీంతో ఆటోలు, క్యాబ్ లు నడుపుకుని జీవనం సాగించేవారు విలపిస్తున్నారు. ఫ్రీ జర్నీ కావడంతో చిన్న పనికి కూడా మహిళలు ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్తున్నారు.
బస్సులలో డబ్బులు చెల్లించి ప్రయాణం చేసే వారికి చాలా ఇబ్బంది ఎదురవుతుంది. రీసెంట్ గా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఒక వ్యక్తి ఆందోళన చేశాడు. మగవారికి బస్సులో ఒక్క సీటు కూడా దొరకడం లేదంటూ మండిపడ్డాడు. సీట్లన్నీ మహిళలే ఆక్రమిస్తే మేమేలా ప్రయాణం చేయాలంటూ ప్రశ్నించాడు. అంతే కాకుండా బస్సు వెళ్ళకుండా  అడ్డుగా నిలబడి తన నిరసన తెలిపాడు. తాజాగా ఓ యువతి బస్టాండ్ లో ఏడుస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. జగిత్యాలకు చెందిన ఆ యువతి కాలేజ్ లో చదువుతుంది. కాలేజీకి ఆమె బస్సులో వెళ్తుంది.
ఫ్రీ జర్నీ వల్ల తనకు రోజు సీటు దొరకట్లేదని కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె కాలేజీకి వెళ్ళేటపుడు 40 నిమిషాలు, తిరిగి ఇంటికి వచ్చేప్పుడు 40 నిమిషాలు పడుతుంది. రోజు బస్సులో సీటు దొరకక గంటకు పైన నిలబడాల్సి వస్తుందని వెక్కి వెక్కి ఏడ్చింది. రోజూ టైమ్ కి కాలేజీకి వెళ్లలేకపోతున్నామని చెప్పింది. ‘బస్సులో ఉచిత ప్రయాణం చేసి నాలాంటి వాళ్లు జర్నీ చేయకుండా చేస్తున్నారు. ఇదే మా ఊరికి చివరి బస్సు, కొత్త బస్సు మాకు కావాలి’ అంటూ ఏడ్చింది. ఆ యువతి ఎక్కే బస్సు పూర్తిగా నిండిపోయి మహిళలు కూడా ఫుడ్ బోర్డ్ పై జర్నీ చేస్తున్నారు.

Also Read: ఎంబీఏ చేసి, పారిశుద్ధ్య కార్మికురాలిగా ఎందుకు మారింది..? ఈ మహిళ కథ ఏంటంటే..?


End of Article

You may also like